బ్యాక్ నుంచి ఫొటోలు తీయకండి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.. ఫొటోగ్రాఫర్లకు టాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ వార్నింగ్
టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ ఆయేషా ఖాన్ తాజాగా కెమెరామెన్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను వెనుక వైపు నుంచి ఫొటోలు తీయొద్దని, కాస్తా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని హిందీ సినిమా ఈవెంట్‌లో ఫోటోగ్రాఫర్లను హెచ్చరించారు ఆయేషా ఖాన్. దీంతో ఆయేషా ఖాన్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సినిమా తారలు ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీల అసహనానికి కారణమవుతుంది. తాజాగా బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ పాపరాజీల (ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు.

గౌరవం సంపాదించుకోవడం మీ చేతుల్లోనే ఉంది!
ఆదర్శ్ గౌరవ్, షనయ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ 'తూ యా మైన్' (Tu Yaa Main) సినిమా ప్రీమియర్ షోకు ఆయేషా ఖాన్ హాజరయ్యారు. అక్కడ రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఆయేషా ఖాన్ ఫోజులిస్తుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను వెనుక వైపు నుంచి షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆయేషా ఖాన్ వెంటనే ఫోజులు ఆపేసి సదరు ఫోటోగ్రాఫర్‌ను నేరుగా ప్రశ్నించారు.
ఇది పద్ధతి కాదు
"గౌరవం సంపాదించుకోవాలన్నా, దానిని పోగొట్టుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది. దయచేసి ఇలా చేయకండి (బ్యాక్ నుంచి ఫొటోలు తీయడం), ఇది పద్ధతి కాదు. చూడటానికి అస్సలు బాగోదు" అంటూ ఫొటోగ్రాఫర్స్‌కు అందరికి కలిపి ఆయేషా ఖాన్ చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు.
వీడియో వైరల్
ఆయేషా ఖాన్ ఆగ్రహాన్ని చూసిన మిగతా ఫోటోగ్రాఫర్లు కూడా సదరు వ్యక్తిని వారించారు. కొద్దిసేపు సీరియస్ లుక్ ఇచ్చిన ఆయేషా ఖాన్ ఆ తర్వాత ఫోటోలకు ఫోజులిచ్చి లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఫొటోగ్రాఫర్లకు ఆయేషా ఖాన్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిజీగా ఆయేషా కెరీర్
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయేషా ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలోని ‘శరారత్’ పాటతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కపిల్ శర్మ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’లోనూ ఆయేషా ఖాన్ నటించారు.
ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు
2025లో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ సినిమాలో ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. వీటికంటే ముందు బిగ్ బాస్ తర్వాత తెలుగులో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్‌గా కనువిందు చేశారు ఆయేషా ఖాన్. ఇదే కాకుండా ముఖచిత్రం, శర్వానంద్ మనమే సినిమాలో కూడా మెరిశారు గ్లామరస్ భామ ఆయేషా ఖాన్.
గతంలోనూ తారల ఆగ్రహం
కాగా, ఫోటోగ్రాఫర్ల అతి ప్రవర్తనపై గళమెత్తిన మొదటి హీరోయిన్ ఆయేషా ఖాన్ మాత్రమే కాదు. గతంలో జాన్వీ కపూర్ కూడా ఈ ‘తప్పుడు యాంగిల్స్’ నుంచి ఫోటోలు తీయవద్దని బహిరంగంగానే చెప్పారు.
మృణాల్ ఠాకూర్ కూడా
తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని మృణాల్ ఠాకూర్, తన మాట వినడం లేదని పాలక్ తివారీ కూడా గతంలో పాపరాజీలపై అసహనం వ్యక్తం చేశారు. ఇక కరీనా కపూర్, అలియా భట్ వంటి అగ్ర తారలు తమ పిల్లల ఏకాంతానికి భంగం కలగకుండా ఫోటోలు తీయవద్దని ఎప్పుడూ కోరుతూనే ఉంటారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


