ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి? అతిథులుగా స్టార్ హీరో హీరోయిన్లు- వైరల్ అవుతున్న మ్యారేజ్ వీడియో- అసలు నిజం ఇదే!

సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి జరిగిపోయినట్లు వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు అతిథులుగా ఉండటం విశేషం. ఈ క్రమంలో ధనుష్, మృణాల్ వివాహం చేసుకున్నారని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక అసలు కథేంటో ఇక్కడ చదవండి.

Published on: Jan 25, 2026, 10:00:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులైన ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వార్తలను ఇప్పటికే కొట్టిపారేసినప్పటికీ.. అభిమానులు మాత్రం ఈ ఇద్దరినీ జంటగా చూడాలని తెగ ఆశపడుతున్నారు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమై నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి? అతిథులుగా స్టార్ హీరో హీరోయిన్లు- వైరల్ అవుతున్న మ్యారేజ్ వీడియో- అసలు నిజం ఇదే!
ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి? అతిథులుగా స్టార్ హీరో హీరోయిన్లు- వైరల్ అవుతున్న మ్యారేజ్ వీడియో- అసలు నిజం ఇదే!

వైరల్ వీడియోలో ఏముంది?

జనవరి 24న ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ధనుష్, మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకున్నట్లు ఒక వీడియో పోస్ట్ అయింది. చెన్నైలో జనవరి 22న చాలా రహస్యంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగిపోయిందని ఆ వీడియో సారాంశం.

కానీ, ధనుష్, మృణాల్ పెళ్లి వేడుకకు స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ కుమార్, దుల్కర్ సల్మాన్, సూర్య, హీరోయిన్లు త్రిష, శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వంటి స్టార్లందరూ హాజరైనట్లు ఆ వీడియోలో ఉంది. ట్రెడిషనల్ తెల్లటి పంచెలో ధనుష్, ఎర్రటి పట్టుచీరలో మృణాల్ పెళ్లి పీటలపై కూర్చున్న విజువల్స్ చూసి ఫ్యాన్స్ నిజంగానే పెళ్లి జరిగిందేమోనని భ్రమపడ్డారు.

అసలు నిజం ఇదీ..

అయితే, ఈ వీడియో వెనుక ఉన్నది మనిషి కాదు.. కృత్రిమ మేధ (AI). అవును, ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ సాంకేతికతతో సృష్టించిన వీడియో. సదరు ఇన్‍‌స్టాగ్రామ్ పేజీ కూడా ఇది కేవలం వినోదం కోసం చేసిన వీడియో మాత్రమేనని, వారిద్దరి పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని చివర్లో డిస్‌క్లైమర్ కూడా ఇచ్చింది.

పెళ్లి వార్తలపై క్లారిటీ

విజయ్, అజిత్ వంటి హీరోలు వెనుక నిలబడి ఉన్న విజువల్స్ చూసి నెటిజన్లు కూడా "ఇది కచ్చితంగా ఏఐ మ్యాజిక్" అని గుర్తిస్తున్నారు. కాగా, ధనుష్, మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే అత్యంత విశ్వసనీయ వర్గాలు ఖండించాయి.

ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి మృణాల్ నటించిన 'దో దీవానే షెహర్ మే' ఫిబ్రవరిలో విడుదల కానుంది.

పెళ్లి చేసుకునే అవకాశమే లేదు

అలాగే మార్చిలో మృణాల్ ఠాకూర్ నటించిన మరో తెలుగు సినిమా డెకాయిట్ కూడా లైన్‌లో ఉంది. ఈ క్రమంలో ఇలా సినిమాల విడుదల సమయంలో మృణాల్ పెళ్లి చేసుకునే అవకాశమే లేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More