బ్యాక్‌గ్రౌండ్‌లో క‌న్నెపిట్ట‌రో రీమిక్స్‌..స్క్రీన్‌పై అడివి శేష్‌, మృణాల్ యాక్ష‌న్‌.. అదిరిపోయిన డెకాయిట్ టీజ‌ర్

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు అడివి శేష్ రాబోతున్నాడు. ఈ సారి డెకాయిట్ గా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీ టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

Published on: Dec 18, 2025, 12:31:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ, విభిన్నమైన స్టోరీలతో కూడిన సినిమాలతో జర్నీ సాగిస్తున్నాడు అడివి శేష్. అతను నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ డెకాయిట్. షానిల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ రాబరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా టీజర్ ను ఇవాళ (డిసెంబర్ 18) రిలీజ్ చేశారు.

డెకాయిట్ టీజర్ రిలీజ్
డెకాయిట్ టీజర్ రిలీజ్

డెకాయిట్ టీజర్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హీస్ట్ థ్రిల్లర్ డెకాయిట్ టీజర్ గురువారం రిలీజైంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ టీజర్ అడివి శేష్ పుట్టిన రోజు మరుసటి రోజు రిలీజైంది. నిన్న శేష్ బర్త్ డే. టీజర్ లో శేష్, మృణాల్ దేశీ బోనీ, క్లైడ్ పాత్రల్లాగా కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో టీజర్ అదిరిపోయింది.

కన్నెపిట్టరో సాంగ్

డెకాయిట్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ లో నాగార్జున సినిమా పాట కన్నెపిట్టరో రీమిక్స్ వినిపిస్తుంటుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. మృణాల్ తన ప్లాన్ కు ఎలా అంగీకరించిందో శేష్ ఒక స్నేహితుడితో చెప్పడంతో డెకాయిట్ టీజర్ స్టార్ట్ అవుతుంది. కానీ అతను ఆమెకు ప్రపోజ్ చేసిన తర్వాత, టీజర్ యాక్షన్ మోడ్ కు మారుతుంది. మృణాల్ డ్రైవింగ్ సీట్లోకి వస్తుంది.

ఇద్దరు దొంగలే

డెకాయిట్ మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ దొంగలుగా నటించినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. మృణాల్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన శేష్ కూర్చున్నాడు. ఇద్దరూ దోపిడీకి పాల్పడిన దొంగలుగా కనిపించారు. నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన 1994లో వచ్చిన హిట్ చిత్రం హలో బ్రదర్ నుంచి 'కన్నె పెట్టారో' రీమిక్స్ వెర్షన్ నేపథ్యంలో బుల్లెట్లు ఎగురుతాయి. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కూడా ఇందులో నటిస్తున్నారు.

డెకాయిట్ రిలీజ్ డేట్

డెకాయిట్ మూవీకి షానీల్ డియో డైరెక్టర్. దీన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. శేష్, షానీల్ సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రాసిన ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, దానుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో నటిస్తున్నారు. డెకాయిట్ మూవీని ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న రిలీజ్ చేయనున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More