జీ5 ఓటీటీలో అదరగొడుతున్న డబుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రెండింగ్‌లో కామెడీ మూవీ కూడా..టాప్-5 లిస్ట్‌పై ఓ లుక్కేయండి
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఓ తెలుగు కామెడీ మూవీ కూడా ఉంది. మీకోసం టాప్-5 ట్రెండింగ్ లిస్ట్ ఇక్కడుంది.
డబుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తోంది. అదే నేరుగా ఓటీటీలోకి వచ్చిన ‘సాలి మొహబ్బత్’ చిత్రం. జీ5లో ఇది ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మరి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాప్-5లో ఉన్నవాటిపై ఓ లుక్కేయండి.

సాలి మొహబ్బత్ ఓటీటీ
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోని సాలి మొహబ్బత్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనం. ఈ డబుల్ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఇండియాలోనే నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ హిందీ సినిమా. ఇందులో రాధికా ఆప్టే, దివ్యేందు, అనురాగ్ కశ్యప్, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు.
ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో
జీ5 ఓటీటీలో తెలుగు కామెడీ మూవీ ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా వ్యూస్లో దూసుకెళ్తోంది. ఈ కామెడీ మూవీ ఆడియన్స్ ను నవ్విస్తోంది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని తదితరులు నటించారు. పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ప్రి వెడ్డింగ్ షూట్ చేసుకుంటుంది. కానీ ఆ ఫొటోగ్రాఫర్ దగ్గర పని చేసే కుర్రాడు ఆ ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డు పోగడతాడు. మరి ఆ తర్వాత ఆ ఫొటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నది ఫన్నీగా ఉంటుంది.
ది బెంగాల్ ఫైల్స్
ఓటీటీలో సత్తాచాటుతున్న మరో థ్రిల్లర్ బెంగాల్ ఫైల్స్. ఇది జీ5 ఓటీటీ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాతో బెంగాల్ విభజన సమయంలో హిందువుల ఊచకోత, చెలరేగిన హింసను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. ఇందులో దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, సిమ్రత్ కౌర్, అనుప్ ఖేర్ తదితరులు నటించారు.
దశావతార్
జీ5 ఓటీటీలో ట్రెండింగ్ నాలుగో ప్లేస్ లో ఉన్న సినిమా దశావతార్. ఈ మూవీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మరాఠీ సినిమా చూసే ఆడియన్స్ కు గొప్ప థ్రిల్ పంచుతుంది. విష్ణు దశావతారాల స్ఫూర్తితో ఓ నాటకరంగ నటుడి జీవితాన్ని తెరకెక్కించారు. దీనికి సుభోద్ డైరెక్టర్. ఈ మూవీలో దిలీప్, మహేష్ మంజ్రేకర్, ప్రియదర్శిని, భరత్ జాదవ్ తదితరులు నటించారు.
ది పెట్ డిటెక్టివ్
అనుపమ పరమేశ్వరన్, షరఫుద్దీన్ జంటగా నటించిన మలయాళ డిటెక్టివ్ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్. ఇది జీ5 ఓటీటీలో ట్రెండింగ్ లో 5వ స్థానంలో ఉంది. ఇందులో హీరో ఓ ప్రైవేట్ డిటెక్టివ్. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తప్పిపోయిన కుక్క కేసును దర్యాప్తు చేస్తుంటాడు. అది కాస్త అండర్ వరల్డ్ మాఫియా గుట్టును బయటకు లాగుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


