పీరియడ్స్‌లో ఉన్నానని గట్టిగా అరిచా, గంటలతరబడి నీళ్లలో తడిపారు- ధనుష్ మూవీ షూటింగ్‌పై హీరోయిన్ పార్వతి ఆవేదన
ధనుష్, మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు కలిసి నటించిన సినిమా మరియన్. సూపర్ హిట్‌గా నిలిచిన మరియన్ షూటింగ్ సమయంలో పార్వతి తిరువోతుకు చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలిపారు. మరియన్ షూటింగ్ తొలిరోజే పీరియడ్స్ కారణంగా తను పడ్డ ఇబ్బందులను పార్వతి తిరువోతు పంచుకున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన మలయాళ ముద్దుగుమ్మ పార్వతి తిరువోతు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వ్యక్తిత్వంతో పార్వతి వార్తల్లో నిలుస్తుంటారు.

ది మేల్ ఫెమినిస్ట్
తాజాగా ‘ది మేల్ ఫెమినిస్ట్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పార్వతి తిరువోతు స్టార్ హీరో ధనుష్ సరసన నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మరియన్’ షూటింగ్ సమయంలో ఎదురైన ఒక ఇబ్బందికరమైన సంఘటనను పంచుకున్నారు.
తొలిరోజే భారీ వర్షం.. పైగా పీరియడ్స్!
2013లో భరత్ బాలా దర్శకత్వంలో వచ్చిన ‘మరియన్’ చిత్ర షూటింగ్ తొలిరోజు అనుభవం పార్వతికి అస్సలు కలిసి రాలేదు. ఆ రోజు కథ ప్రకారం హీరోయిన్ పూర్తిగా నీళ్లలో తడవాలి, హీరోతో రొమాంటిక్ సీన్ చేయాలి.
నీళ్లు కుమ్మరిస్తూనే
"షూటింగ్ మొదలైన మొదటి రోజే నేను పీరియడ్స్‌లో ఉన్నాను. అక్కడ నాపై గంటల తరబడి నీళ్లు కుమ్మరిస్తూనే ఉన్నారు. నా దగ్గర అదనంగా మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అప్పట్లో నా చుట్టూ నా అవసరాలు చూసుకోవడానికి పెద్ద టీమ్ కూడా ఉండేది కాదు" అని పార్వతి తిరువోతు వివరించారు.
నిర్మాతల మొండివైఖరి.. పార్వతి గట్టి జవాబు!
నీళ్లలో అంతసేపు తడిసిన తర్వాత చలితో వణికిపోతూ, అసౌకర్యంగా ఫీలైన పార్వతి.. హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని అడిగారట. కానీ, చిత్ర బృందం మాత్రం అందుకు సమయం లేదని, కుదరదని తెగేసి చెప్పారట.
గట్టిగా అరిచి చెప్పాను
"వాళ్లు ఒప్పుకోకపోవడంతో చేసేదేం లేక.. నాకు పీరియడ్స్ వచ్చాయి, నేను కచ్చితంగా వెళ్లాలి అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది. అది విన్న తర్వాత అక్కడ ఉన్న మగవాళ్లంతా ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో ఉండిపోయారు" అని పార్వతి తిరువోతు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మహిళల సౌకర్యాల సందర్భంగా
వర్క్ ప్లేస్‌లో మహిళలకు ఉండాల్సిన కనీస సౌకర్యాల గురించిన సందర్భంగా తన ఆవేదనను పంచుకున్నారు మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పార్వతి చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి.
హృతిక్ సంస్థ నిర్మాణంలో
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సొంత నిర్మాణ సంస్థ 'హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్' నిర్మిస్తున్న ‘ది స్టోర్మ్’ (The Storm) ఓటీటీ వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు నటిస్తున్నారు. అజిత్ పాల్ సింగ్ సృష్టిస్తున్న ఈ హై-స్టేక్స్ థ్రిల్లర్ డ్రామా ముంబై నేపథ్యంలో సాగనుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ది స్టోర్మ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో పార్వతితో పాటు అలయా ఎఫ్, సబా ఆజాద్ వంటి ఇతర బ్యూటిపుల్ హీరోయిన్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


