మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత.. మెగాస్టార్ పరామర్శ!

మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శాంతకుమారి కొచ్చిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Dec 30, 2025, 16:42:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలోనే ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత.. మెగాస్టార్ పరామర్శ!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత.. మెగాస్టార్ పరామర్శ!

వృద్ధాప్య సమస్యలతో పోరాటం

శాంతకుమారి గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్యం కారణంగా ఆమె చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. తొలుత తిరువనంతపురంలో ఉన్న శాంతకుమారిని మెరుగైన చికిత్స కోసం మోహన్ లాల్ కొచ్చికి తీసుకువచ్చారు.

అక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, తన నివాసంలోనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 10న ఆమె తన 90వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.

షూటింగ్‌ నుంచి హుటాహుటిన..

తల్లి మరణ వార్త తెలిసే సమయానికి మోహన్ లాల్ కొచ్చిలోనే ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మోహన్ లాల్‌కు తన తల్లితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా, ఆయన అవార్డు తీసుకుని నేరుగా వచ్చి ముందుగా తన తల్లి ఆశీర్వాదమే తీసుకున్నారు. అనేక ఇంటర్వ్యూలలో తన విజయానికి మూలం తన తల్లేనని ఆయన గర్వంగా చెప్పుకునేవారు మోహన్ లాల్.

తరలివచ్చిన మెగాస్టార్

మోహన్ లాల్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ వార్త తెలియగానే ఎలమక్కరలోని వారి నివాసానికి చేరుకున్నారు. తన ప్రాణ మిత్రుడిని పరామర్శించి, శాంతకుమారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మమ్ముట్టితో పాటు మాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు మోహన్ లాల్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

కాగా, శాంతకుమారి భర్త, కేరళ ప్రభుత్వ మాజీ లా సెక్రటరీ విశ్వనాథన్ నాయర్ చాలా ఏళ్ల క్రితమే మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారీలాల్ కూడా 2000వ సంవత్సరంలో మృతి చెందారు.

విషాదం నెలకొనడం

ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో మోహన్ లాల్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ పోస్టులు పెడుతున్నారు. న్యూ ఇయర్‌లోకి అడుగుపెడుతున్న వేళ మోహన్ లాల్ ఇంట్లో విషాదం నెలకొనడం అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More