నేనేం చేశానని ఇంతగా అభిమానిస్తున్నారు.. ఇదో మిస్టరీ: ఇంటి ముందు ఫ్యాన్స్ ఫొటో షేర్ చేస్తూ మెగాస్టార్ ఎమోషనల్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శుక్రవారం (డిసెంబర్ 12) చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం గురించి చెబుతూ.. తన ఇంటి ముందు గుమిగూడిన ఫ్యాన్స్ ఫొటోను షేర్ చేశాడు.

Published on: Dec 12, 2025, 21:01:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన నివాసం 'జల్సా' బయట అభిమానుల కోలాహలాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గత ఆదివారం (డిసెంబర్ 7) నాటి వీడియోలు, ఫోటోలను తన బ్లాగ్‌లో షేర్ చేస్తూ.. "ఇంతటి ప్రేమను పొందేందుకు నేనేం చేశానో నాకే తెలియదు" అని రాసుకొచ్చాడు. ఇదే సమయంలో కొడుకు అభిషేక్ బచ్చన్‌పై ఒక అభిమాని చూపిన ప్రేమని చూసి గర్వంగా ఉందంటూ కామెంట్ చేశాడు.

నేనేం చేశానని ఇంతగా అభిమానిస్తున్నారు.. ఇదో మిస్టరీ: ఇంటి ముందు ఫ్యాన్స్ ఫొటో షేర్ చేస్తూ మెగాస్టార్ ఎమోషనల్
నేనేం చేశానని ఇంతగా అభిమానిస్తున్నారు.. ఇదో మిస్టరీ: ఇంటి ముందు ఫ్యాన్స్ ఫొటో షేర్ చేస్తూ మెగాస్టార్ ఎమోషనల్

అమితాబ్ బచ్చన్ ‘మిస్టరీ’ పోస్ట్

ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం 'జల్సా' బయట అభిమానులను కలుసుకోవడం అమితాబ్ బచ్చన్‌కు అలవాటు. అయితే తాజాగా అక్కడ కనిపించిన జనసంద్రం, వారి అభిమానం చూసి అతడు ఎమోషనల్ అయ్యాడు. శుక్రవారం (డిసెంబర్ 12) నాడు తన బ్లాగ్‌లో ఆ వీడియోలను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జల్సా బయట అభిమానులు తన కోసం కేరింతలు కొడుతుంటే, వారి ప్రేమను చూసి అమితాబ్ ఆశ్చర్యపోయాడు.

"అభిమానుల ప్రేమ, వారి కేరింతలు పెరుగుతూనే ఉన్నాయి. వారు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను కొలవలేం. ఇంతటి ప్రేమకు అర్హుడిని కావడానికి నేనేం చేశాననేది నాకూ ఒక మిస్టరీగానే ఉంది. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని బిగ్ బి తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.

అలాగే మనసు గురించి, నిర్ణయాల గురించి తాత్విక ధోరణిలో రాస్తూ.. "మనం సలహాలు అడిగే కొద్దీ మనసు గందరగోళానికి గురవుతుంది. అప్పుడు నిర్ణయం మీది కాదు, వారిది అవుతుంది" అని అన్నాడు.

కొడుకును చూసి గర్వంగా..

ఈ జనసందోహంలో ఒక అభిమాని అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ ఫోటో ఉన్న పోస్టర్‌ను పట్టుకుని కనిపించాడు. అందులో అభిషేక్ సినిమాలను ప్రశంసిస్తూ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. దీనిపై అమితాబ్ స్పందించాడు. "కొడుకు ఎప్పుడూ గర్వాన్ని, గౌరవాన్ని తీసుకొస్తాడు.. మేం నిజంగా అదృష్టవంతులం" అని తండ్రిగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

తండ్రీ కొడుకుల కెరీర్ అప్‌డేట్స్

అభిషేక్ బచ్చన్ ఇటీవల 'కాళీధర్ లాపతా' (తమిళ సినిమా 'కేడీ'కి రీమేక్)లో కనిపించాడు. త్వరలో షారుక్ ఖాన్, సుహానా ఖాన్‌లతో కలిసి సుజోయ్ ఘోష్ 'కింగ్' (King) సినిమాలో కనిపించనున్నాడు.

అటు అమితాబ్ బచ్చన్ చివరగా రజినీకాంత్ సినిమా ‘వేట్టైయాన్’లో కనిపించాడు. ఇందులో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ కూడా నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More