అమితాబ్ బచ్చన్‌కు కూడా ఆ పరిస్థితి తప్పలేదు.. ఆ సినిమాలతో చాలా నష్టపోయాం: తన భర్త ఆర్థిక కష్టాలపై రకుల్ ప్రీత్ సింగ్
తన భర్త ఆర్థిక నష్టాలు, కష్టాలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. రెండు, మూడు సినిమాలతో తీవ్రంగా నష్టపోయామని, అయితే తమ ప్రొడక్షన్ హౌస్ మూసేస్తున్నామన్న వార్తలను మాత్రం ఆమె ఖండించింది.
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ పేరు సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త ఆర్థిక ఇబ్బందులపై స్పందించింది. గతేడాది వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై నటి, జాకీ భార్య అయిన రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తమ నిర్మాణ సంస్థను మూసివేయలేదని, పరిస్థితిని మీడియాలో అతిగా చేసి చూపించారని ఆమె స్పష్టం చేసింది.

రకుల్ ప్రీత్ ఏమన్నదంటే?
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ తమ కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మూతపడలేదని క్లారిటీ ఇచ్చింది.
"మనం ఈ రోజు క్లిక్-బైట్ (ఇంటర్నెట్‌లో క్లిక్స్ కోసం ఆకర్షించే లింక్స్) సంస్కృతిలో ఉన్నాం. జనాలకు ఆకర్షించే వార్తలు కావాలి. అందుకే లేనిపోనివి రాస్తుంటారు. కానీ నాకు వాస్తవం ఏంటో తెలుసు. బయట వచ్చే పుకార్ల వల్ల నేను ప్రభావితం కాను. పరిశ్రమలో ఉన్నప్పుడు బయట వినిపించే ఈ పుకార్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలి" అని రకుల్ చెప్పింది.
అమితాబ్ బచ్చన్‌కే తప్పలేదు..
కుటుంబానికి ఇది నిజంగా సవాలుతో కూడుకున్న సమయమని రకుల్ అంగీకరించింది. "వార్తల్లో వచ్చినవన్నీ నిజం కాదు. ఏ కంపెనీ మూతపడలేదు. నాకు అసలు విషయం తెలుసు కాబట్టి నేను ఆ వార్తలను పట్టించుకోలేదు. అవును రెండు మూడు సినిమాలు ఆడలేదు. దానివల్ల భారీ ఆర్థిక నష్టం వచ్చింది. అది వాస్తవమే. కానీ ప్రతి నిర్మాతకు ఇది జరుగుతుంది. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ కు కూడా ఇది జరిగింది. ఇదొక దశ మాత్రమే" అని రకుల్ తెలిపింది.
జాకీ భగ్నానీ ఆర్థిక కష్టాలు
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' 2024లో అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని భావించారు. కానీ అది ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ దెబ్బతో జాకీకి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్థిక సంక్షోభంలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
సినిమా విడుదలైన తర్వాత తమ పేమెంట్స్ క్లియర్ చేయలేదని పలువురు సిబ్బంది ఆరోపించారు. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నడుమ సుమారు రూ. 250 కోట్ల అప్పు తీర్చడానికి ముంబైలోని తమ 7 అంతస్తుల ఆఫీసును అమ్మేశారనే వార్తలు కూడా వచ్చాయి.
గతేడాది సినిమా షూటింగ్ సమయంలో అబుదాబి అధికారుల నుండి తీసుకున్న సబ్సిడీ నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ వషు భగ్నానీ, జాకీ భగ్నానీలు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


