మళ్లీ పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- అతి తక్కువగా- ధనుష్, కృతి సనన్‌ల అమర కావ్యం 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!

తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 8: ధనుష్, కృతి సనన్ నటించిన లేటేస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. తెలుగులో అమర కావ్యం అనే టైటిల్‌తో విడుదలైన ఆ సినిమా కలెక్షన్స్ మరోసారి పడిపోయాయి. ఈ క్రమంలో తేరే ఇష్క్ మే 8 రోజుల కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

Published on: Dec 6, 2025, 06:14:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ అగ్ర హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ తొలిసారి జోడీ కట్టి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమర కావ్యం అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు.

మళ్లీ పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- అతి తక్కువగా- ధనుష్, కృతి సనన్‌ల అమర కావ్యం 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!
మళ్లీ పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- అతి తక్కువగా- ధనుష్, కృతి సనన్‌ల అమర కావ్యం 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!

తగ్గిపోయిన కలెక్షన్స్

విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్స్‌లలో జోరు చూపించిన తేరే ఇష్క్ మే సినిమా మరోసారి వెనుకంజ వేసింది. అంటే మళ్లీ బాక్సాఫీస్ వద్ద తేరే ఇష్క్ మే కలెక్షన్స్ తగ్గిపోయాయి. విడుదలైన తొలి 7 రోజుల్లో భారతదేశంలో తేరే ఇష్క్ మే రూ. 83.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

హిందీ నుంచే ఎక్కువగా

ఈ వారం రోజుల తేరే ఇష్క్ మే కలెక్షన్స్‌లలో హిందీ నుంచి రూ. 79.75 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా మాత్రం రూ. 3.9 కోట్ల వసూళ్లు ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట్రీ తమిళం నుంచి కంటే హిందీ బెల్డ్ ద్వారానే అధిక కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

ఏడో రోజుతో పోలిస్తే

ఇదిలా ఉంటే, తేరే ఇష్క్ మే సినిమాకు 8వ రోజు (డిసెంబర్ 5) శుక్రవారం నాడు కాస్తా కలెక్షన్స్ తగ్గాయి. 8వ రోజున అమర కావ్యం సినిమాకు ఇండియాలో రూ. 3.7 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి. అంటే, ఏడో రోజుతో పోలిస్తే 8వ రోజున సుమారుగా 36.21 శాతం వసూళ్లు పడిపోయాయి.

తమిళంలో 2 లక్షలు మాత్రమే

అలాగే, విడుదలైన 8 రోజుల్లో అధికంగా వసూళ్లు పడిపోయి అతి తక్కువగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. 8 రోజుల్లో ఈరోజే అమర కావ్యం అతి తక్కువగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ కలెక్షన్స్‌లో హిందీ నుంచి 3.5 కోట్ల నెట్ రాగా తమిళం ద్వారా 2 లక్షల కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి.

తేరే ఇష్క్ మే థియేటర్ ఆక్యుపెన్సీ

ఇక 8 రోజుల్లో ఇండియాలో ఓవరాల్‌గా తేరే ఇష్క్ మే సినిమాకు రూ. 87.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, డిసెంబర్ 5న హిందీలో తేరే ఇష్క్ మే సినిమాకు ఓవరాల్‌గా 18.44 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇద్దరి కాంబినేషన్‌లో

ఇదిలా ఉంటే, తేరే ఇష్క్ మే సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో ఇప్పటికీ రాంఝనా, ఆత్రంగి రే సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా మంచి రొమాంటిక్ మ్యూజికల్ హిట్ ఫిల్మ్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు వచ్చిన తేరే ఇష్క్ మే కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More