రెండోసారి పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్, కృతి సనన్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ 6 రోజుల వసూల్లు ఎంతంటే?

తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 6: ధనుష్, కృతి సనన్ నటించిన రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. అయితే, విడుదలైన ఆరు రోజుల్లో రెండోసారి తేరే ఇష్క్ మే కలెక్షన్స్ పడిపోయాయి. తేరే ఇష్క్ మే 6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

Published on: Dec 4, 2025, 06:21:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ మొదటిసారి జంటగా నటించిన రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రోజు రోజు వసూల్లు పెంచుకుంటూ పోయింది. మూడో రోజున తొలిసారిగా వసూల్లు పడిపోయాయి.

రెండోసారి పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్, కృతి సనన్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ 6 రోజుల వసూల్లు ఎంతంటే?
రెండోసారి పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్, కృతి సనన్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ 6 రోజుల వసూల్లు ఎంతంటే?

తేరే ఇష్క్ మే కలెక్షన్స్

ఇప్పుడు తాజాగా రెండోసారి కూడా తేరే ఇష్క్ మే కలెక్షన్స్ పడిపోయాయి. విడుదలైన తొలి ఐదు రోజుల్లో భారతదేశంలో తేరే ఇష్క్ మే రూ. 71 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆరో రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద కొద్దిగా పడిపోయింది. ఆరవ రోజున, ఈ బహుభాషా చిత్రం తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో రూ. 6.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

డే బై డే కలెక్షన్స్

అయితే, అంతకుముందు ఐదో రోజున తేరే ఇష్క్ మే కలెక్షన్స్ ఇండియాలో రూ. 10.25 కోట్లుగా ఉన్నాయి. తేరే ఇష్క్ మే శుక్రవారం (నవంబర్ 28) రూ. 16 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత శనివారం రూ. 17 కోట్లు (+6.25% పెరుగుదల), ఆదివారం రూ. 19 కోట్లు (+11.76% పెరుగుదల) కలెక్షన్స్ వచ్చాయి.

తొలిసారిగా పడిపోయింది

అనంతరం వీక్ డే కారణంగా సోమవారం రూ .8.75 కోట్లు (-53.95% తగ్గుదల) మాత్రమే రాబట్టింది తేరే ఇష్క్ మే సినిమా. ఆ తర్వాత మళ్లీ కలెక్షన్స్ ఊపందుకున్నాయి. అలా మంగళవారం రూ.10.25 కోట్లు (+17.14% పెరుగుదల) కలెక్షన్స్‌తో తేరే ఇష్క్ మే వసూల్లు పెరిగాయి.

తేరే ఇష్క్ మే 6 డేస్ కలెక్షన్స్

ఇప్పుడు మరోసారి ఆరో రోజున తేరే ఇష్క్ మే కలెక్షన్స్ పడిపోయాయి. ఇకపోతే ఇలా ఆరు రోజుల్లో మొత్తంగా ఇండియాలో తేరే ఇష్క్ మే సినిమాకు రూ. 76.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇకపోతే తేరే ఇష్క్ మే సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ కీలక భారతీయ నగరాలలో ప్రాంతాన్ని బట్టి మారుతూ వస్తోంది.

థియేటర్ ఆక్యుపెన్సీ

హిందీలో ఆరో రోజు అయిన డిసెంబర్ 3న 12.84 శాతంగా తేరే ఇష్క్ మే థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఈ ఆక్యుపెన్సీ‌లో చెన్నై, జైపూర్ 16 శాతంతో ఆధిక్యంలో ఉన్నాయి. ఆ తరువాత లక్నో 15.33% వద్ద ఉంది.

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం

ముంబై, పూణే, ఎన్సీఆర్ 12 శాతం నుంచి 13 శాతం మధ్య స్థిరమైన ఆక్యుపెన్సీ రేటును నమోదు చేయగా, హైదరాబాద్, కోల్ కతా, అహ్మదాబాద్, చండీగఢ్, సూరత్, భోపాల్ 5.33 శాతం నుంచి 11.67 శాతం వరకు తగ్గాయి. కాగా ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More