గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భర్తతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా- రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ సీన్!

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 వేడుకలో గ్లోబల్ స్టార్, వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భర్త నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ పోజుతో ప్రియాంక సందడి చేసింది. అలాగే, భార్య ప్రియాంక జుట్టును నిక్ జోనాస్ ప్రేమగా సరిచేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Jan 12, 2026, 14:03:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హాలీవుడ్ అవార్డుల సందడి మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఆదివారం (జనవరి 11) రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్స్ వేడుకల్లో గ్లోబల్ స్టార్, భారతీయ నటి, వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భర్తతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా- రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ సీన్! (Reuters)
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భర్తతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా- రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ సీన్! (Reuters)

అవార్డ్ ప్రజెంటర్‌గా ప్రియాంక

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2026కి అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా విచ్చేసింది. అయితే ప్రియాంక తన భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్స్ 2026 రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్‌గా మెరిశారు. ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ పోజుతో అందరిని అట్రాక్ట్ చేశారు.

రెడ్ కార్పెట్‌పై ‘నమస్తే’..

నీలి రంగు ఆఫ్-షోల్డర్ గౌనులో ప్రియాంక చోప్రా దేవకన్యలా మెరిసిపోతుంటే, నిక్ జోనాస్ బ్లాక్ టక్సేడోలో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. వేదిక వద్దకు రాగానే ప్రియాంక తనదైన శైలిలో ‘నమస్తే’ అంటూ అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు.

ప్రియాంక, నిక్ రొమాంటిక్ సీన్

ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో ప్రియాంక జుట్టు కాస్త చెదిరితే, నిక్ దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా దానిని సరిచేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఆ మధుర క్షణాన్ని, రొమాంటిక్ సీన్‌ను అక్కడున్న ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు.

వీడియోపై కామెంట్స్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "నిక్ నిజంగా పర్‌ఫెక్ట్ హస్బండ్.. వారి మధ్య ప్రేమ చూడముచ్చటగా ఉంది" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

గోల్డెన్ గ్లోబ్స్ 2026 విశేషాలు

ఈసారి గోల్డెన్ గ్లోబ్స్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లియోనార్డో డికాప్రియో నటించిన పొలిటికల్ డ్రామా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్’ (One Battle After Another), అలాగే హారర్ చిత్రం ‘సిన్నర్స్’ (Sinners) ఈ ఏడాది అవార్డుల రేసులో ముందున్నాయి.

ఫిల్మ్ క్రిటిక్స్‌తో

టెలివిజన్ విభాగంలోనూ గట్టి పోటీ నెలకొంది. హెచ్‌బీఓ వారి బ్లాక్ కామెడీ ‘ది వైట్ లోటస్’, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘సెవెరెన్స్’, టీనేజ్ మర్డర్ మిస్టరీ ‘అడోలెసెన్స్’ ఓటీటీ సిరీస్‌లు నామినేషన్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ క్రిటిక్స్‌ ఈసారి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయడం విశేషం.

రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్‌గా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ (AFP)
రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్‌గా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ (AFP)

1300 కోట్లతో వారణాసి

ఇక బ్యూటిఫుల్ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వారణాసి మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 1300 కోట్లు అని టాక్ నడుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More