మహేశ్ బాబు ఫ్యామిలీతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా, రానా భార్య మిహీకా- 2025 జ్ఞాపకాలతో నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టా రీల్

మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ 2025 ఏడాదికి ఘనంగా వీడ్కోలు చెబుతూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇందులో మహేశ్ బాబు, పిల్లలతో పాటు గ్లోబల్ స్టార్, వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా కనిపించడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Dec 31, 2025, 19:45:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘట్టమనేని వారింట పాత జ్ఞాపకాలు పలకరించాయి. మాజీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ 2025 ఏడాదికి సంబంధించిన అత్యంత మధురమైన క్షణాలను ఒక 'రీల్' రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మహేశ్ బాబు ఫ్యామిలీతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా, రానా భార్య మిహీకా- 2025 జ్ఞాపకాలతో నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టా రీల్
మహేశ్ బాబు ఫ్యామిలీతో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా, రానా భార్య మిహీకా- 2025 జ్ఞాపకాలతో నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టా రీల్

ప్రియాంక చోప్రాతో నమ్రత చిల్ అవుట్!

ఈ వీడియోలో మహేశ్ బాబు, గౌతమ్, సితారలతో కూడిన ఫ్యామిలీ ఫోటోలతో పాటు కొన్ని అరుదైన చిత్రాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ రీల్‌లో అందరినీ ఆకర్షించింది మాత్రం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. మహేశ్ బాబు భారీ చిత్రం 'వారణాసి'లో ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నమ్రత, ప్రియాంకల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సరదాగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే, నమ్రత తన సోదరి శిల్పా శిరోద్కర్, దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్‌లతో దిగిన సెల్ఫీలు కూడా ఇందులో ఉన్నాయి.

శ్రీలంక వెకేషన్ నుంచి గణపతి పూజ వరకు..

శ్రీలంక వంటి విదేశీ విహారయాత్రలు, ఇంట్లో జరుపుకున్న వినాయక చవితి వేడుకలు, ఇటీవల జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఇలా 2025 ఏడాది జరిగిన విశేషాలన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్ బాబు గారాల పట్టి సితారను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు ఎంతో భావోద్వేగంగా ఉన్నాయి.

ఇదే సమయంలో తమ ముద్దుల కుక్క 'నోబు' మరణాన్ని గుర్తుచేసుకుంటూ నమ్రత పెట్టిన ఫోటో అభిమానుల కళ్లు చెమర్చేలా చేసింది. ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లింది. అందుకు మహేష్ బాబు ఫ్యామిలీ ఇప్పటికే హైదరాబాద్‌ను వీడింది.

సోమవారం ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు, నమ్రత, సితార, గౌతమ్ కెమెరాలకు చిక్కారు. ఎప్పటిలాగే మహేశ్ సింపుల్ లుక్‌లో కనిపించగా, తండ్రిని అనుకరిస్తూ సితార వేసుకున్న టీ-షర్ట్, జీన్స్, హ్యాట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

రాజమౌళి ‘వారణాసి’ అప్‌డేట్

ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) తో బిజీగా ఉన్నారు.

నవంబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరిగిన ‘గ్లోబ్‌ట్రోటర్’ ఈవెంట్‌లో వారణాసి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More