ఓటీటీలోకి ప్రియాంక చోప్రా ది బ్లఫ్- సముద్రపు దొంగగా వారణాసి బ్యూటీ- ఇక ఆ హీరోను మర్చిపోండి- అదిరిపోయిన ఫస్ట్ లుక్‌!

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘బ్లడీ మేరీ’గా ప్రియాంక చోప్రా ఊరమాస్ అవతారం, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లతో మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Jan 8, 2026, 10:10:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పటివరకు సముద్రపు దొంగ జాక్ స్పారోగా హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కరెబియన్ ఆఫ్ పైరెట్స్ సిరీస్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జానీ డెప్‌ను ఇక మర్చిపోయేలా చేసేందుకు వస్తోంది బ్యూటిఫుల్ అండ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

ఓటీటీలోకి ప్రియాంక చోప్రా ది బ్లఫ్- సముద్రపు దొంగగా వారణాసి బ్యూటీ- ఇక ఆ హీరోను మర్చిపోండి- అదిరిపోయిన ఫస్ట్ లుక్‌! (Instagram)
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా ది బ్లఫ్- సముద్రపు దొంగగా వారణాసి బ్యూటీ- ఇక ఆ హీరోను మర్చిపోండి- అదిరిపోయిన ఫస్ట్ లుక్‌! (Instagram)

అత్యంత క్రూరమైన, రక్తపాతంతో కూడిన సముద్రపు దొంగగా ప్రియాంక చోప్రా కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ది బ్లఫ్’ (The Bluff) చిత్రం నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను బుధవారం (జనవరి 7) రిలీజ్ చేశారు మేకర్స్.

ఒళ్లు గగుర్పొడిచే ‘బ్లడీ మేరీ’ అవతారం

ది బ్లఫ్ సినిమాలో ప్రియాంక చోప్రా ‘బ్లడీ మేరీ’గా కనిపిస్తున్న తీరు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్టర్లను పంచుకుంటూ.. "తల్లి.. రక్షకురాలు.. సముద్రపు దొంగ.. బ్లడీ మేరీని కలవండి" అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.

ఫస్ట్ లుక్ చిత్రంలో ప్రియాంక గాలిలోకి ఎగిరి సహ నటుడు కార్ల్ అర్బన్‌పై ఆయుధంతో దాడి చేస్తున్న దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ముఖమంతా రక్తం, ఒళ్లంతా దుమ్ముతో, శత్రువుపై విరుచుకుపడుతున్న ప్రియాక చోప్రా తీరు సినిమాలోని యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఒక చేతిలో శంఖాన్ని పంచ్‌లాగా పట్టుకుని శత్రువును దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉన్న వారణాసి హీరోయిన్ ప్రియాంక లుక్ వైరల్ అవుతోంది.

నెట్టింట స్పందన.. దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్!

ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు ప్రియాంక మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు. "దేశీ గర్ల్ ఈజ్ బ్యాక్.. అది కూడా ఒక కటిక వేటగాడిలా (Butcher)" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఆమెను కాళికా మాతతో పోల్చుతున్నారు.

ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా ఈ లుక్‌ను రీ-పోస్ట్ చేస్తూ.. "ప్రపంచం ఈ అద్భుతాన్ని చూసే వరకు నేను ఆగలేను" అని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఓటీటీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ తర్వాత రూసో బ్రదర్స్ నిర్మాణంలో ప్రియాంక చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ది బ్లఫ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్‌లో ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 25న ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇకపోతే ది బ్లఫ్ కథ విషయానికొస్తే.. 1800వ కాలం నాటి కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ 'ఆర్-రేటెడ్' (R-rated) అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. ఎర్సెల్ 'బ్లడీ మేరీ' బోడెన్ అనే మాజీ పైరేట్ క్వీన్ కథ ఇది.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రియాంక చోప్రా వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More