దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తారలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి- క్యారెక్టర్ టీజర్ రిలీజ్- మనసుకు హత్తుకునే బీజీఎమ్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి చేస్తోంది. ఈ సందర్భంగా సాత్విక వీరవల్లి క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ బీజీఎమ్, దుల్కర్ సల్మాన్ ఎంట్రీతో ఆకాశంలో ఒక తార సినిమాపై అంచనాలు పెరిగాయి.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. లక్కీ భాస్కర్, కాంత సినిమాలతో అలరించిన దుల్కర్ సల్మాన్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఆయన గట్టిగా నమ్ముతుంటారు.

ఆకాశంలో ఒక తార ఫస్ట్ లుక్
ఆ నమ్మకంతో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఇదివరకు విడులైన ఆకాశంలో ఒక తార మూవీ ఫస్ట్ లుక్, టీజర్ అందరినీ ఆకట్టుకోవటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి.
యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్టర్ పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా
పెద్ద నిర్మాణ సంస్థలు భాగం కావటంతో ఆకాశంలో ఒక తార సినిమా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ ప్రముఖ బ్యానర్స్ మరో బ్రిలియంట్ టాలెంట్‌ను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. ఆకాశంలో ఒక తార చిత్రంతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
సోమవారం (జనవరి 19) రోజున ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్ సాత్విక వీరవల్లి క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను గమనిస్తే.. సరైన రోడ్లు కూడా లేని ఓ మారమూల పల్లె నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఆకాశంలో తారలను చేరుకోవాలంటూ కనే కలలను కథగా చూపించారు.
హృదయాలకు హత్తుకునే బీజీఎమ్
దీనికి హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హృదయాలను హత్తుకునేలా బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు. సాత్వికను అందంగా చూపించారు. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మెప్పించటానికి సిద్ధంగా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది.
అయితే, ఆకాశంలో ఒక తార సినిమాలో నటీనటులెవరనే విషయాలను ఇంకా పూర్తిగా చెప్పకపోయినప్పటికీ విడుదలైన గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె ప్రయాణంలోని నిశ్శబ్దమైన క్షణాలు చాలా భావాలను వ్యక్తం చేసేలా ఉన్నాయి. అలాగే, , చివరల్లో దుల్కర్ సల్మాన్ తళుక్కున కనిపించటం హైలెట్‌గా ఉంది.
టీజర్ చివర్లో దుల్కర్
వైవిధ్యమైన, అర్థవంతమైన కథలను ఎంచుకునే దుల్కర్ సల్మాన్ అభిరుచికి తగ్గట్లు, డైరెక్టర్ పవన్ సాధినేని క్రియేటివిటీ కలిసి ఒక ప్రత్యేకమైన, గుర్తుండిపోయే సినిమాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రూపొందుతోంది.
విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే సినిమా సెన్సెటివ్ కథతో, బలమైన ఎమోషన్స్‌తో రూపొందుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
4 భాషల్లో రిలీజ్
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా శ్వేత సాబుసిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా మంచి నటీనటులు, టెక్నీషియన్స్ కలయికతో రూపొందుతోన్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


