ఒక్క ఫ్లాప్ రాగానే అంతా మారిపోయింది- స్క్రిప్ట్ సెలక్షన్‌ నేర్పిస్తామన్నారు- దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందనే సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని దుల్కర్ ను అడిగితే మాత్రం షాకింగ్ కామెంట్లు చేశాడు. కాంత ప్రమోషన్లలో భాగంగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఒక్క ఫ్లాప్ రాగానే అంతా మారిపోయిందన్నాడు. 

Published on: Nov 09, 2025 3:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడు దుల్కర్ సల్మాన్ తన రాబోయే తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 'కాంత' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళలోని లులూ మాల్‌ను సందర్శించి, అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన స్క్రిప్ట్ ఎంపిక గురించి ప్రస్తావన రాగా, ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో నటుడు వివరించాడు. పరోక్షంగా 'కింగ్ ఆఫ్ కొత్త' (2023) గురించి ప్రస్తావించాడు.

దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్

దుల్కర్ కామెంట్లు

ఒక అభిమాని మైక్ తీసుకుని దుల్కర్‌ సల్మాన్ ను ప్రశంసిస్తూ.. 'మీరు ఇంత మంచి స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకుంటారు?' అని అడిగాడు. దానికి సమాధానంగా దుల్కర్ పరోక్షంగా 'కింగ్ ఆఫ్ కొత్త' గురించి గుర్తుచేసేలా కామెంట్లు చేశాడు.

“సినిమాలు ఆడినప్పుడే అది మంచి ఎంపిక అవుతుంది. ఆడనప్పుడు కాదు. నా సినిమాలు హిట్టయితే నా స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతం అంటారు. అదే నా సినిమా ఒకటి ఫ్లాప్ అయితే, అతనికి స్క్రిప్ట్ చదివి ఎంచుకోవడం కూడా రాదు అంటారు. నాకు నేర్పిస్తామని కూడా అంటుంటారు. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను. మంచి సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం” అని దుల్కర్ అన్నాడు.

ఫ్లాప్ మూవీ

దుల్కర్ నటించి, నిర్మించిన 'కింగ్ ఆఫ్ కొత్త' భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 31.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గతేడాది అక్టోబర్‌లో దుల్కర్ తన విరామం గురించి ఇలా అన్నాడు. “నాకు ఒక చిన్న విరామం అవసరమైంది. ఇది ఎవరి తప్పు కాదు. కొన్ని సినిమాలు ఆగిపోయాయి. నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి” అని కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్లాప్ తర్వాత దుల్కర్ బ్రేక్ తీసుకున్నాడు.

లక్కీ భాస్కర్ తో

ఆ నిరాశ తర్వాత దుల్కర్ బలంగా పుంజుకున్నాడు. 2024లో దుల్కర్ 'కల్కి 2898 AD'లో అతిథి పాత్రలో నటించాడు. తెలుగు చిత్రం 'లక్కీ భాస్కర్'తో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఆయన నిర్మించిన 'లోకా: చాప్టర్ 1 – చంద్ర' మలయాళంలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.

'కాంత' నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్‌కు తెలుగులో 'ఆకాశంలో ఒక తార', మలయాళంలో 'ఐ యామ్ గేమ్' చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

News/Entertainment/ఒక్క ఫ్లాప్ రాగానే అంతా మారిపోయింది- స్క్రిప్ట్ సెలక్షన్‌ నేర్పిస్తామన్నారు- దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్!
News/Entertainment/ఒక్క ఫ్లాప్ రాగానే అంతా మారిపోయింది- స్క్రిప్ట్ సెలక్షన్‌ నేర్పిస్తామన్నారు- దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్!