పెళ్లి చేసుకోనున్న ధనుష్, మృణాల్ ఠాకూర్- వాలంటైన్స్ డే రోజు ముహూర్తం అంటూ వైరల్ వార్తలు- నిజమెంత?

ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య రిలేషన్ షిప్ పై వార్తలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని, వాలెంటైన్స్ డే రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే రూమర్లు వస్తున్నాయి. మరి వీటిలో నిజమెంత? అన్నది చూద్దాం.

Published on: Jan 16, 2026 6:08 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. వాలెంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14, 2026న వీళ్లు పెళ్లి చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఇదే టాపిక్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు (Photos: Instagram, IMDb)
ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు (Photos: Instagram, IMDb)

ధనుష్, మృణాల్ పెళ్లి?

ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ జంట ఫిబ్రవరి 14, 2026న పెళ్లి చేసుకోబుతున్నారనే పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లికి ధనుష్, మృణాల్ ఠాకూర్ కు చాలా దగ్గరివాళ్లు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. చాలా కొద్ది మంది సమక్షంలోనే వీళ్లు వివాహమాడతారని అంటున్నారు.

నిజమెంత?

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని గత కొంతకాలం నుంచి రూమర్లు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఏ ఒక్కరూ రియాక్ట్ కాలేదు. అయితే ఇటీవల వీళ్లు క్లోజ్ గానే ఉంటున్నారని తెలుస్తోంది. ఒకరి మూవీ ఈవెంట్ కు మరొకరు అటెండ్ కావడం, ఇన్ స్టాలో ధనుష్ సిస్టర్స్, మృణాల్ ఒకరి అకౌంట్ ను మరొకరు ఫాలో కావడం.. ఇలాంటి కొన్ని ఘటనల వల్ల డేటింగ్ కన్ఫామ్ అని ఫిక్సయిపోయారు.

అయితే ఈ పెళ్లి వార్తలపై ధనుష్, మృణాల్ ఠాకూర్ లో ఎవరూ రియాక్టవలేదు. ఖండించనూ లేదు. దీన్ని బట్టి వెనకాల ఏదో జరుగుతుందనే విషయం మాత్రం అర్థమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిల్లు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. అలాగే ధనుష్, మృణాల్ వెడ్డింగ్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆ ప్రీమియర్ లో

2025 ఆగస్టులో మృణాల్ చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌కు ధనుష్ అటెండ్ అయ్యాడు. అంతకుముందే ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే' ర్యాప్ పార్టీలో ఆమె ఉండటం ఇప్పటికే ఊహాగానాలకు దారితీసింది. ఆమె ధనుష్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా ఈ చర్చలకు మరింత బలాన్నిచ్చింది. ఆ తర్వాత ధనుష్ పోస్టుకు మృణాల్ కామెంట్ కూడా వైరల్ గా మారింది.

సీక్రెట్ గా

ఇటీవల సమంత-రాజ్ నిడిమోరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ కూడా ఎవరికీ తెలియకుండానే జరిగిపోయింది. ఇప్పుడు మృణాల్-ధనుష్ మ్యారేజ్ కూడా అలాగే జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న ధనుష్ ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు.