మృణాల్ ఠాకూర్ డేటింగ్ ఎవరితో.. ధనుష్, శ్రేయస్ అయ్యర్ అంటూ రూమర్లు.. ఆమె రియాక్షన్ ఇలా..

మృణాల్ ఠాకూర్ డేటింగ్ పై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. కొన్నాళ్లు ధనుష్ అని, మరికొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్ అని అన్నారు. తాజాగా ఈ పుకార్లపై మృణాల్ స్పందించింది. ఆమె ఏమన్నదో చూడండి.

Published on: Dec 1, 2025, 13:43:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన నటనతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్.. ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నటుడు ధనుష్‌తో, తాజాగా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ ఊహాగానాలకు మృణాల్ తనదైన శైలిలో, చాలా కూల్‌గా సమాధానం ఇచ్చింది.

మృణాల్ ఠాకూర్ డేటింగ్ ఎవరితో.. ధనుష్, శ్రేయస్ అయ్యర్ అంటూ రూమర్లు.. ఆమె రియాక్షన్ ఇలా..
మృణాల్ ఠాకూర్ డేటింగ్ ఎవరితో.. ధనుష్, శ్రేయస్ అయ్యర్ అంటూ రూమర్లు.. ఆమె రియాక్షన్ ఇలా..

మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇదే

మృణాల్ ఠాకూర్ ఆదివారం (నవంబర్ 30) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకుంది. ఇందులో ఆమె తల్లి ఆమె తలకు మసాజ్ చేస్తుండగా, మృణాల్ వీడియో రికార్డ్ చేయడం చూడొచ్చు. ఇద్దరూ కెమెరా వైపు చూస్తూ పగలబడి నవ్వుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోకి ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

"వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు.. మేము నవ్వుకుంటాం. పుకార్లు అనేవి ఫ్రీ పీఆర్ లాంటివి. నాకు ఫ్రీగా వచ్చేవి అంటే చాలా ఇష్టం" అని మృణాల్ అనడం విశేషం. ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతోందో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, ఇటీవల తన డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు ఇదే ఆమె సమాధానం అని నెటిజన్లు భావిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్?

ఈ మధ్య 'రెడిట్' వేదికగా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. మృణాల్ ఠాకూర్, టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్ని నెలలుగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని, వారి బంధం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది ఆ పోస్ట్ సారాంశం. వీరిద్దరూ తమ బంధాన్ని ప్రైవేట్ గా ఉంచుతున్నారని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

దీనికి ముందు ఆగస్టులో జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ ఈవెంట్‌లో మృణాల్.. నటుడు ధనుష్ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు వచ్చాయి. ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం, ధనుష్ 'తేరే ఇష్క్ మే' సినిమా ప్రమోషన్ కోసం వారణాసి వెళ్ళినప్పుడు పెట్టిన ఫోటోలకు మృణాల్ కామెంట్ చేయడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.

సినిమాల విషయానికొస్తే..

మృణాల్ చివరగా అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో కనిపించింది. రవి కిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.65.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ప్రస్తుతం ఆమె ‘దో దీవానే షెహర్ మే’ అనే సినిమాలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ మూవీకి రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ సినిమా ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More