ఆ సంబంధాలు తెగిపోతాయని భయం.. తల్లి అయ్యాక వచ్చిన మార్పుల గురించి చెప్పిన హీరోయిన్ అలియా భట్

మాతృత్వం తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనిపిస్తోందని, తల్లి అయ్యాక వచ్చాక మార్పుల గురించి వివరించారు అలియా భట్. ఇప్పుడు అలియా భట్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 31, 2026, 10:25:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు తన జీవితంలోని అత్యంత అందమైన దశను ఆస్వాదిస్తున్నారు. 2022లో కూతురు రాహా కపూర్‌కు జన్మనిచ్చిన తర్వాత తల్లిగా ఆమె ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా ‘ఎస్క్వైర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్ తన వ్యక్తిగత జీవితం, కీర్తి ప్రతిష్టలు, తల్లి అయ్యాక వచ్చిన మార్పులు, సోషల్ మీడియాపై తనకున్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఆ సంబంధాలు తెగిపోతాయని భయం.. తల్లి అయ్యాక వచ్చిన మార్పుల గురించి చెప్పిన హీరోయిన్ అలియా భట్
ఆ సంబంధాలు తెగిపోతాయని భయం.. తల్లి అయ్యాక వచ్చిన మార్పుల గురించి చెప్పిన హీరోయిన్ అలియా భట్

ఒక్కోసారి అంతా వదిలేయాలనిపిస్తుంది!

సోషల్ మీడియా ఒత్తిడి గురించి అలియా భట్ స్పందిస్తూ.. "కొన్ని రోజులు నిద్రలేవగానే అసలు ఈ సోషల్ మీడియాను డిలీట్ చేసేయాలనిపిస్తుంది. కేవలం నటనపైనే దృష్టి పెట్టే ఒక నటిగా మాత్రమే ఉండాలని అనుకుంటాను. నిరంతరం ఏదో ఒక చర్చలో భాగం కావడం నాకు నచ్చదు. కానీ, మొదటి నుంచి నాకు అండగా నిలుస్తున్న లక్షలాది మంది అభిమానులతో సంబంధాలు తెగిపోతాయని భయం. అందుకే ఆ పని చేయలేకపోతున్నాను" అని వివరించారు.

ఫోన్ నిండా రాహా ఫోటోలే!

తల్లి అయ్యాక తన దినచర్యలో వచ్చిన మార్పులను అలియా భట్ ఆసక్తికరంగా పంచుకున్నారు. "ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం చాలా పర్సనల్ అయిపోయింది. నా ఫోన్‌లోని ఫోటో ఆల్బమ్ మొత్తం రాహా ఫోటోలతోనే నిండిపోయింది. నా సొంత ఫోటోలు తీసుకోవాలంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా కష్టపడాల్సి వస్తోంది. మాతృత్వం అనేది ఒక మనిషి శరీరాన్నే కాదు, ఆలోచనా తీరును కూడా పూర్తిగా మార్చేసే ఒక పెద్ద మార్పు" అని అలియా భట్ పేర్కొన్నారు.

అలియా-రణ్‌బీర్ ప్రేమ ప్రయాణం

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో రాహా పుట్టింది. 2023 క్రిస్మస్ సందర్భంగా మొదటిసారిగా తమ గారాల పట్టిని మీడియా ముందుకు తీసుకువచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

బిజీ బిజీగా అలియా కెరీర్

కెరీర్ పరంగా కూడా అలియా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె 'ఆల్ఫా' (Alpha) అనే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఒక ఎలైట్ ఉమెన్ కాంబాట్ యూనిట్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

లవ్ అండ్ వార్ మూవీ

ఈ సినిమాలో శర్వరీ వాగ్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలుత 2026 ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల మరికొంత ఆలస్యంగా థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' అనే పీరియడ్ డ్రామాలోనూ అలియా నటించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More