హారర్ క్రైమ్ థ్రిల్లర్‌తో తమిళంలోకి తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్ ఎంట్రీ- ప‌వ‌ర్‌ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్‌గా మండవెట్టి!

టాలీవుడ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ మండవెట్టి అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ నేచురల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న మండవెట్టి పూజా కార్యక్రమాలను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోమలి ప్రసాద్ దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 30, 2026, 11:51:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు హీరోయిన్ కోమ‌లి ప్ర‌సాద్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ మూవీస్‌తో అలరించిన కోమలి ప్రసాద్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమానే ‘మండవెట్టి’. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ హారర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది.

హారర్ క్రైమ్ థ్రిల్లర్‌తో తమిళంలోకి తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్ ఎంట్రీ- ప‌వ‌ర్‌ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్‌గా మండవెట్టి!
హారర్ క్రైమ్ థ్రిల్లర్‌తో తమిళంలోకి తెలుగు హీరోయిన్ కోమలి ప్రసాద్ ఎంట్రీ- ప‌వ‌ర్‌ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్‌గా మండవెట్టి!

ప్రేక్షకుల ప్రేమ కావాలంటూ

కోమలి ప్రసాద్ సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్య‌మైన, కొత్త చాప్ట‌ర్‌ అని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోమ‌లి ప్రసాద్ మ‌న‌స్ఫూర్తిగా కోరారు. ‘మండ‌వెట్టి’ సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

మధురై జిల్లాలో షూటింగ్

ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న మండవెట్టి సినిమాకు శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. తాజాగా మండవెట్టి మూవీ టీమ్‌ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు న‌ట‌కు ప్రాధాన్య‌మున్న ఈ క‌థ‌కు తెర‌పై జీవం పోయ‌టానికి శ్ర‌మిస్తున్నారు.

మహిళ ప్రధానమైన కథతో

‘మండ‌వెట్టి’తో కోమలి ప్రసాద్ త‌న‌ సినీ కెరీర్‌లో కొత్త భాష‌, కొత్త సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సూప‌ర్ నేచుర‌ల్ హారర్, క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో పాటు మిస్టిసిజం, ఎమోష‌న్స్ క‌ల‌యిక‌గా ఓ మ‌హిళ ప్ర‌ధానమైన క‌థ‌తో సినిమా తెర‌కెక్కుతోంది.

అన్ని అంశాలని మిళితం చేసి

మ‌న‌కు కావాల్సిన దాన్ని కోల్పోవ‌టంతో కలిగే బాధ‌, గుర్తింపు, జీవ‌న పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామ‌న్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ను రూపొందించారు. పెర్ఫామెన్స్‌తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్య‌మున్న ఈ క‌థంతా కోమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధానంగా సాగుతుంది.

సెన్సిబుల్ సైకలాజికల్ మూవీ

‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్‌, సైక‌లాజిక‌ల్ మూవీని రూపొందించి ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్‌రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్ర‌ధానంగా మండ‌వెట్టి సినిమాను రూపొందిస్తున్నారు.

భావోద్వేగాలు ప్రతిబింబించేలా

ఈ సినిమా విష‌యంలో ఆయ‌న ఎమోష‌న్స్‌, పాత్రల అంతర్గతభావాల‌పై పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మూవీలో అంశాలు కేవ‌లం ప్రేక్ష‌కులు చూడ‌టానికే కాదు.. పాత్ర‌ల్లోని భావోద్వేగాలు ప్ర‌తిబింబంగా మెప్పించ‌నున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

మండవెట్టి సాంకేతికవర్గం

అలాగే, మండవెట్టి సినిమాలో తేన‌ప్ప‌న్‌, గ‌జ‌రాజ్‌, అమృత స‌హాయ‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. వీరి న‌ట‌న క‌థ‌లోని ఎమోష‌న్స్‌కు మ‌రింత బాల‌న్ని తీసుకురానున్నాయట. సాంకేతికంగా చూస్తే.. సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్, ఎడిటర్ కునా, సంగీత దర్శకుడు దీపక్ వేణుగోపాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ గౌతమ్ వ‌ర్క్ చేస్తున్నారు.

కోమలి ప్రసాద్ సినిమాలు

స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో బెస్ట్ మూవీని రూపొందించ‌టానికి టీమ్ ప‌ని చేస్తోందని తెలుస్తోంది. ప్రారంభం నుంచే ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భావోద్వేగాలు ఉన్న పాత్రలకే కోమలి ప్రసాద్ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆమె తెలుగు ఆడియెన్స్‌ను నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ P.C. 524, హిట్ – సెకండ్ కేస్, హిట్ – థర్డ్ కేస్, శశివదనే చిత్రాలతో కోమలి ప్రసాద్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More