OTT Telugu: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్

బ్యూటిపుల్ హీరోయిన్ శ్రియా శరణ్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను సౌత్ ఇండియన్ హీరోయిన్ అని పిలవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరిద్వార్‌లో పుట్టి పెరిగిన శ్రియా శరణ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Published on: Jan 30, 2026, 10:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరిద్వార్‌ వంటి ఒక చిన్న పట్టణంలో, హిందీ మాట్లాడే కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. దక్షిణ భారత సినీ రంగంలో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలుగుతుందని ఎవరూ ఊహించలేదు. భాష తెలియదు, సంస్కృతి కొత్త.. అయినా సరే, శ్రియా శరణ్ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తనపై ఉన్న ‘సౌత్ హీరోయిన్’ అనే ముద్ర గురించి శ్రీయా శరణ్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్- ఇస్రో సైంటిస్ట్‌గా- సౌత్ హీరోయిన్ అని పిలవడంపై కామెంట్స్

ఒక ఇంజనీర్ కూతురు.. నటిగా మారడం ఒక సంచలనం!

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నేను హరిద్వార్‌లో పుట్టాను. 17 ఏళ్ల వయసు వరకు అక్కడే ఉన్నాను. కథక్ నేర్చుకోవడం కోసం ఢిల్లీకి మారడం నా జీవితంలో మొదటి పెద్ద మలుపు" అని శ్రియా శరణ్ అన్నారు.

"మా నాన్న ఇంజనీర్, అమ్మ టీచర్.. అలాంటి క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చి నేను నటిని అవుతానంటే అందరూ షాక్ అయ్యారు" అని శ్రియా శరణ్ వివరించారు. ఢిల్లీ వంటి మెట్రో నగరానికి మారడం, అక్కడ లేడీ శ్రీరామ్ (LSR) కాలేజీలో చదువుకోవడం తనను నేటి ప్రపంచానికి సిద్ధం చేశాయని ఆమె పేర్కొన్నారు.

నా గుండె చప్పుడు సౌత్ ఇండియా!

2001లో ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రియా శరణ్ ఛత్రపతి, శివాజీ, మనం వంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్ చిత్రాల్లో నటించారు. హిందీలో ‘దృశ్యం’ వంటి హిట్స్ ఉన్నప్పటికీ, మీడియా తనను ఎప్పుడూ ‘సౌత్ హీరోయిన్’ అని పిలుస్తుంటుంది.

దీనిపై శ్రియా శరణ్ స్పందిస్తూ.. "నన్ను అలా పిలవడం నాకు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నిజానికి దక్షిణాది ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిది. ఇప్పుడు నా మనసు పూర్తిగా ‘సౌత్ ఇండియన్’ అయిపోయింది" అని చెప్పుకొచ్చారు.

లేబుల్స్ గురించి శ్రియా ఫిలాసఫీ

మనుషులు మనల్ని ఏదో ఒక గాడిలో పెట్టాలని చూస్తుంటారని, కానీ మనం దాన్ని ఎలా స్వీకరిస్తామనేదే ముఖ్యమని శ్రియా తెలిపారు. "జనాలు మిమ్మల్ని గుర్తిస్తున్నారంటేనే మీకో లేబుల్ వేస్తారు. ఆ చట్రంలో మనం ఉండిపోకూడదు (అక్కడితో ఆగిపోకూడదు అర్థంలో). నేర్చుకుంటూ ముందుకు సాగితే ఆ లేబుల్సే మనకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను ఇస్తాయి" అని శ్రియా శరణ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

2026లో శ్రియా సందడి: ఇస్రో సైంటిస్ట్‌గా సరికొత్త అవతారం

ఇటీవలే శ్రియా శరణ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పేస్ జెన్: చంద్రయాన్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో శ్రియా శరణ్ ఒక శాస్త్రవేత్త పాత్రను పోషిస్తున్నారు.

నకుల్ మెహతా కీలక పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23న తెలుగులో కూడా స్పేస్ జెన్: చంద్రయాన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇది మాత్రమే కాకుండా, ఈ ఏడాది చివర్లో రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’లో కూడా శ్రియా శరణ్ కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More