OTT Show:ఓటీటీ రియాలిటీ గేమ్ షోకు హోస్ట్‌గా కన్నప్ప శివుడు-పదేళ్ల తర్వాత బుల్లితెరపై స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీ ఎంట్రీ

దాదాపు దశాబ్దం తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మళ్లీ హోస్ట్‌గా బుల్లితెరపై మెరవనున్నారు. సోనీ టీవీలో వస్తున్న ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ షో ద్వారా తన అదృష్ట చక్రాన్ని తిప్పేందుకు కన్నప్ప మూవీలో శివుడి పాత్ర చేసిన అక్షయ్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని కీలక మలుపులను ఆయన పంచుకున్నారు.

Published on: Jan 30, 2026, 09:16:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ యాక్షన్ స్టార్, అందరూ ప్రేమగా పిలుచుకునే 'ఖిలాడీ కుమార్' అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత గూటికి చేరుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన పూర్తిస్థాయి హోస్ట్‌గా బుల్లితెరపై కనిపిస్తున్నారు.

ఓటీటీ రియాలిటీ గేమ్ షోకు హోస్ట్‌గా కన్నప్ప శివుడు-పదేళ్ల తర్వాత బుల్లితెరపై స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీ ఎంట్రీ
ఓటీటీ రియాలిటీ గేమ్ షోకు హోస్ట్‌గా కన్నప్ప శివుడు-పదేళ్ల తర్వాత బుల్లితెరపై స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీ ఎంట్రీ

అంటే, సుమారు పదేళ్లకు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు ఖిలాడీ అక్షయ్ కుమార్. సోనీ టీవీలో ప్రారంభమైన ప్రసిద్ధ గేమ్ షో ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ (Wheel of Fortune) భారతీయ వెర్షన్‌కు అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

గుర్తింపు తెచ్చిన టీవీ ప్రయాణం

అక్షయ్‌కి బుల్లితెర కొత్తేమీ కాదు. 2004లో ‘సెవెన్ డెడ్లీ ఆర్ట్స్’తో మొదలైన ఆయన బుల్లితెర ప్రయాణం, ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ (2008-2011)తో శిఖర స్థాయికి చేరింది. ఆ తర్వాత మాస్టర్ చెఫ్ ఇండియా, డేర్ 2 డ్యాన్స్ వంటి షోలతో అలరించిన అక్షయ్ కుమార్ చివరగా 2017లో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో కాసేపు మెరిశారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు అక్షయ్ కుమార్.

ఈ షోనే ఎందుకు ఎంచుకున్నారంటే?

"నేను ఏదైనా అర్థవంతమైన, సంతోషాన్నిచ్చే పని చేయాలనుకున్నాను. ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఇందులో చురుకైన ఆలోచనలు, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇవి నేను వ్యక్తిగతంగా నమ్మే విలువలు" అని అక్షయ్ వివరించారు.

ఓటీటీ రియాలిటీ గేమ్ షో అయిన వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ జనవరి 27 నుంచి సోనీ టీవీ, సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కంటెస్టెంట్లు ఒక పెద్ద చక్రాన్ని తిప్పి ప్రైజ్ మనీ గెలుచుకుంటూ, పదాల పజిల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

నా అదృష్టం ఒక రోజులో మారలేదు!

తన కెరీర్‌లో అదృష్ట చక్రం ఎప్పుడు తిరిగింది అన్న ప్రశ్నకు అక్షయ్ కుమార్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. "నా జీవితంలో అదృష్టం అనేది ఏదో ఒక అద్భుతం వల్ల రాలేదు. సౌకర్యవంతమైన జీవితం కంటే క్రమశిక్షణే మిన్న అని నేను నమ్ముతాను" అని అక్షయ్ కుమార్ తెలిపారు.

"సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాకు ప్రతి అవకాశం నేను పడ్డ కష్టం వల్లే దక్కింది. సమయపాలన, కష్టపడే తత్వం, వృత్తి పట్ల నిజాయితీ.. ఇవే నన్ను ఇక్కడిదాకా తెచ్చాయి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఎవరికైనా అదృష్టం కలిసి వస్తుంది" అని 58 ఏళ్ల అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

సినిమా కబుర్లు

మూడు దశాబ్దాల కెరీర్‌లో ‘హేరా ఫేరీ’, ‘ధడకన్’, ‘ప్యాడ్ మ్యాన్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో మెప్పించిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘భూత్ బంగ్లా’, అలాగే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘హైవాన్’ వంటి సినిమాలతో అక్షయ్ కుమార్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More