OTT Telugu: కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను, నటిగా చాలా సంతృప్తినిచ్చిన ఓటీటీ సిరీస్ ఇది- హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్
టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించిన తెలుగు ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. రెండు సీజన్స్‌తో ఆకట్టుకున్న ఈ సిరీస్ నుంచి సినిమాగా కాల్ ఘాట్ చాప్టర్ 3 థియేటర్లలోకి రానుంది. ఇటీవల నిర్వహించిన గ్లింప్స్ రిలీజ్ లాంచ్ ఈవెంట్‌లో వర్ష బొల్లమ్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీ మూవీతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ ఆ తర్వాత స్వాతి ముత్యం, స్టాండప్ రాహుల్, ఊరు పేరు భైరవకోన, తమ్ముడు సినిమాలతో అలరించింది.

ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్
సినిమాలతోనే కాకుండా ఓటీటీ సిరీస్ కానిస్టేబుల్ కనకంతో కూడా అట్రాక్ట్ చేసింది వర్ష బొల్లమ్మ. తెలుగు ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కానిస్టేబుల్ కనకం నుంచి ఇప్పటికి రెండు సీజన్స్ వచ్చి అలరించాయి. ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ అందరిని మెప్పిస్తోంది.
అయితే, ఈ రెండు సీజన్స్‌తో కలిపి ఓ సినిమాగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 టైటిల్‌తో మరో మూవీని కూడా రిలీజ్ చేయనున్నారు.
కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ రిలీజ్
దీనికి సంబంధించి ఇటీవల కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ను కూడా రిలీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని బ్లెస్స్ చేసిన రాఘవేంద్ర రావు గారికి, నిర్మాత అశ్విని దత్ గారికి థాంక్యూ సో మచ్. వాళ్లు ఇచ్చిన సపోర్టు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది" అని అన్నారు.
పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలని
"చాప్టర్ 3 కాల్ ఘాట్ చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. చాలామంది నేను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలని అంటుంటారు. కానీ, అలాంటి అవకాశాలు సాధారణంగా రావు. నాకు అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత సాయిబాబా గారికి, హేమంత్ గారికి, ఈటీవీ విన్ ఓటీటీ వారికి, మా డైరెక్టర్ ప్రశాంత్‌కి చాలా చాలా థాంక్స్" అని వర్ష బొల్లమ్మ చెప్పింది.
"ఈ ఓటీటీ సిరీస్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక నటిగా చాలా సంతృప్తిని ఇచ్చిన సిరీస్ ఇది. రాజీవ్ కనకాల గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. అందరికీ పేరు పేరునా థాంక్యూ. చాప్టర్ 3 నాకు ఒక సర్‌ప్రైజ్ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. అది ఇందులో హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. కానిస్టేబుల్ కనకంకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని వర్ష బొల్లమ్మ తన స్పీచ్ ముగించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


