OTT: మేమిద్దరం మహేశ్ బాబును పరిచయం చేశాం, రాజమౌళి నేను అనుకున్నదానికంటే అద్భుతంగా తీశాడు: డైరెక్టర్ రాఘవేంద్ర రావు
సినిమాగా వస్తున్న ఓటీటీ సిరీస్ కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3. ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కానిస్టేబుల్ కనకం సీజన్ 1, 2లతో కలిపి కాల్ ఘాట్ చాప్టర్ 3ని మూవీగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ ఓటీటీ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు.

సినిమాగా ఓటీటీ సిరీస్
ఈ ఓటీటీ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్‌లో సినిమాగా విడుదల చేయనున్నారు. కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు.
మేమిద్దరం మహేశ్ బాబుని పరిచయం చేశాం
ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేశ్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి, గంగోత్రి.. ఎన్నో సకెస్‌ఫుల్ సినిమాలు చేశాం. ఆ విజయాల్లో భాగం సాయిబాబాకి, ఈటీవీకి ఉంది" అని అన్నారు.
ఈటీవీతో మా జర్నీ మొదలైంది
"తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతినివాసం సీరియల్‌తో ఈటీవీతో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసం సీరియల్‌కు రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా తీశాడు. ఈరోజు ఇండియాలోనే అగ్ర దర్శకుడుగా ఉన్నారు" అని కె రాఘవేంద్ర రావు తెలిపారు.
సక్సెస్ రేట్ చాలా బాగుంది
"శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటినుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ, నితిన్ లక్కీ హాండ్స్. వీళ్ల కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ల సక్సెస్ రేట్ చాలా బాగుంది" అని డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు చెప్పారు.
పది కథలు తీశాను
"సురేష్ చక్కని మ్యూజిక్ అందించాడు. ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధాలో ఇప్పటివరకు ఒక పది కథలు తీశాను. వాళ్ల ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్ యూ" అని తన స్పీచ్ ముగించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


