ఇవాళ ఓటీటీలోకి వచ్చిన హార్ట్ టచింగ్ లవ్ సినిమా చూశారా? రాఘవేంద్ర రావు స్టోరీ-ఫీల్ గుడ్ మూవీ
సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ మూవీ వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ కు ఫీల్ గుడ్ వైబ్ అందిస్తోంది. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు కావడం విశేషం.
ఓటీటీలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చిన తెలుగు మూవీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ వీక్ కు ఎండ్ చెప్తున్న సండే కూడా ఓ ఫీల్ గుడ్ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. ‘మళ్లీ వచ్చిన వసంతమ్’. ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ ప్రేమికులను అలరిస్తోంది.

మళ్లీ వచ్చిన వసంతమ్ ఓటీటీ
ఓటీటీలోకి సండే స్పెషల్ గా ఇవాళ (జనవరి 11) ‘మళ్లీ వచ్చిన వసంతమ్’ అనే ఫీల్ గుడ్ మూవీ వచ్చేసింది. ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లో ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంటే ఈ మూవీ రాఘవేంద్ర రావు మార్క్ స్టైల్ తో సాగుతుందనేది అర్థమవుతోంది.
కథాసుధలో
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం కథాసుధలో భాగంగా కొత్త షార్ట్ ఫిల్మ్ ను స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వారం మళ్లీ వచ్చిన వసంతమ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీలో కాశ్వీ, తేజ, విష్ణు తదితరులు నటించారు. దీనికి శరణ్య తేజు డైరెక్టర్. డీఓపీ శేఖర్ గంగణమోని. సాయి మధుకర్ మ్యూజిక్ అందించారు.
ఒరిజినల్స్ తో అదుర్స్
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లతో అదరగొడుతోంది. ఈ ఓటీటీలోకి ఈ నెలలోనే వచ్చిన కానిస్టేబుల్ కనకం సీజన్ 2 సత్తాచాటుతోంది. ఓటీటీని షేక్ చేస్తోంది. ఇది మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఇదే కాకుండా అంతకుముందు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్-ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా కూడా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
ఈటీవీ విన్ ట్రెండింగ్
ప్రస్తుతం ఈటీవీ విన్ ట్రెండింగ్ లో షోలు, సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. డిసెంబర్ 31 సందర్భంగా ప్రీమియర్ అయిన కమ్ టు ది పార్టీ షో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ మూవీ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఇది ట్రెండ్ అవుతోంది.
రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రెండింగ్ నంబర్ త్రీగా ఉంది. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా ఈ లిస్ట్ లో ఉంది. మరి మీ ఫేవరెట్ షోలు, సినిమాలు, సిరీస్ లను ఈటీవీ విన్ లో చూసేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


