సంక్రాంతి సంద‌డి డ‌బుల్ కావాలా? ఇంకెందుకు లేటు.. ఫ్యామిలీతో క‌లిసి చూసే ఈ ఓటీటీ సినిమాల‌పై లుక్కేయండి

సంక్రాంతి సందడి మొదలైంది. స్కూల్స్ కు సెలవులు వచ్చేశాయి. కాలేజీ యూత్ కూడా ఊరి బాట పడుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంత ఊరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ఈ పండగ ఆనందాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో చూసే ఈ ఓటీటీ సినిమాలపై ఓ లుక్కేయండి. 

Published on: Jan 10, 2026 9:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాండి షురూ అయింది. ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల పతంగులు, ఇంటికి వచ్చే మన వాళ్లతో పండగ సందడి మొదలైంది. పండగ అంటే సంతోషమే. ఇక ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంటే అది డబుల్ అవుతుంది. అలాంటి డబుల్ సందడిని అందించేందుకు ఓటీటీలో కొన్ని సినిమాలున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎలాంటి సందేహం లేకుండా చూసే చిత్రాలివి.

ఓటీటీలో సంక్రాంతి స్పెషల్ మూవీస్
ఓటీటీలో సంక్రాంతి స్పెషల్ మూవీస్

అఖండ 2

ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ అఖండ 2. నందమూరి బాల‌కృష్ణ‌ హీరోగా నటించిన ఈ మూవీ సనాతన హిందు ధర్మం గొప్పతనాన్ని చాటుతోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఖండ 2ను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బాల‌కృష్ణ‌ పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు.

సామజవరగమన

తెలుగులో కొన్నేళ్లలో వచ్చిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ సామజవరగమన. చక్కగా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లో చూసే సినిమా ఇది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమించిన అమ్మాయి వరసకు చెల్లె అయితే అప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటీ? అన్నది చాలా ఫన్నీగా చూపించారు. చివర్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇది ఆహా ఓటీటీలో ఉంది.

బ్రహ్మ ఆనందం

తండ్రీకొడుకుల మధ్య సాగే ఫన్నీ, ఎమోషనల్ జర్నీనే బ్రహ్మా ఆనందం మూవీ. ఇందులో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కామెడీతో సాగుతూనే మంచి ఫ్యామిలీ మెసేజ్ అందిస్తుంది. ఈ చిత్రం కూడా ఆహా ఓటీటీలోనే ఉంది.

జనక అయితే గనక

నేటి తరం మధ్య తరగతి భర్త కష్టాలను, భయాలను కళ్లకు కట్టిన సినిమా జనక అయితే గనక. సుహాస్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీలో మంచి టైమ్ పాస్. ఆర్థికంగా పరిస్థితి మెరుగయ్యాకే తండ్రి అవుదామనే లక్ష్యంతో ఉండే ఆ భర్త అనుకోకుండా ఫాదర్ అవుతే అప్పుడు పరిస్థితి ఏంటన్నదే జనక అయితే గనక మూవీ. ఇది ఆహా ఓటీటీలో ఉంది.

హనుమాన్

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. సూపర్ హీరోగా తేజ అదరగొట్టాడు. ఇందులోని స్టోరీ, హనుమంతుడి నేపథ్యం ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది. ఇక తేజ లేటెస్ట్ మూవీ మిరాయ్ ను కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. మిరాయ్ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

సంక్రాంతికి వస్తున్నాం

గతేడాది సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. పండగకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో కలిసి వెంకటేష్ చేసే ఫన్ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ మూవీ జీ5 ఓటీటీలో ఉంది.