ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన అఖండ 2 తాండవం.. కుంభమేళాలో చైనా బయోవార్.. రుద్ర సికందర్ అఘోరాగా బాల‌కృష్ణ‌ పవర్ ఫుల్ యాక్షన్

నందమూరి బాల‌కృష్ణ‌ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించిన మూవీ అఖండ 2. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి ఫ్యాన్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎంటర్ టైన్ చేస్తోంది. 

Published on: Jan 9, 2026, 05:46:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రుద్ర సికందర్ అఘోరాగా పవర్ ఫుల్ యాక్షన్ తో నందమూరి బాల‌కృష్ణ‌ అదరగొట్టిన మూవీ అఖండ 2. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి పండగను ముందే తెస్తూ బాలయ్య ఫ్యాన్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎంటర్ టైన్ చేయనుంది. శుక్రవారం (జనవరి 9) నుంచి అఖండ 2 తాండవం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

అఖండ 2 లో బాల‌కృష్ణ‌ (x)
అఖండ 2 లో బాల‌కృష్ణ‌ (x)

అఖండ 2 ఓటీటీ

నందమూరి బాల‌కృష్ణ‌ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అఖండ 2 డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

థియేటర్ రిలీజ్

అఖండ 2 తాండవం డిసెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయింది. బోయపాటి శ్రీనివాస్-నందమూరి బాల‌కృష్ణ‌ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా ఇది. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఈరోస్ ఇంటర్నేషనల్ తో వివాదం కారణంగా రిలీజ్ ఆలస్యమై 12న విడుదల అయింది. ఈ సినిమాలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి తదితరులు నటించారు.

బయోవార్

అఖండ సినిమాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, తన తమ్ముడి కూతురు కోసం పోరాటం చేస్తాడు రుద్ర సికిందర్ అఘోరా. ఆ సినిమాలో దొంగ బాబా, అక్రమ మైనింగ్, అమాయక ప్రజలను చంపడం చుట్టూ కథ సాగుతోంది. కానీ అఖండ 2కు వచ్చేసరికి అది ఇండియా వర్సెస్ చైనా వార్ వరకూ వెళ్తుంది.

ఇండియాలో జరిగే కుంభమేళాను టార్గెట్ గా చేసుకుని చైనా బయోవార్ ప్లాన్ చేస్తుంది. కుంభమేళాలో స్నానం చేసిన వాళ్లలో చాలా మంది అపస్మారక స్థితికి వెళ్లిపోతారు. దీనికి మన సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కనిపెడతారు. కానీ అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ ను నాశనం చేసి, అందరినీ చంపేస్తారు.

జనని ఎవరు?

ఆ ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ తో జనని ఒక్కరే బయటపడుతుంది. ఆమెను చంపేందుకు వెంటపడతారు. అప్పుడే రుద్ర సికిందర్ అఘోరా ఎంట్రీ ఇస్తాడు. జనని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. అసలు జనని ఎవరు? ఆమెకు ఆపద వచ్చిందనే విషయం రుద్రకు ఎలా తెలిసింది? చివరకు ఏమైంది అన్నది అఖండ 2లో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More