జీ తెలుగులో సంక్రాంతి హంగామా.. వీకెండ్ నుంచే పండగ షురూ.. స్పెషల్ షోలు, తెలుగు కామెడీ మూవీ వరల్డ్ ప్రీమియర్

జీ తెలుగులో సంక్రాంతి హంగామా ఈ వీకెండ్ నుంచే మొదలు కానుంది. స్పెషల్ షోలతోపాటు తెలుగు కామెడీ మూవీ మిత్ర మండలి వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా ఉండనుంది. సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Published on: Jan 10, 2026, 11:53:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండగ వస్తుందంటే చాలు తెలుగు టీవీ ఛానెల్స్ లో హంగామా మొదలవుతుంది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి పోటీపడి స్పెషల్ షోలు, సినిమాలతో సందడి చేస్తుంటాయి. ఈ సంక్రాంతికి కూడా జీ తెలుగు ఛానెల్ పలు షోలతో అలరించబోతోంది. ఈ ఆదివారం (జనవరి 11) నుంచే ఆ ఛానెల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ వివరాలు చూడండి.

జీ తెలుగులో సంక్రాంతి హంగామా.. వీకెండ్ నుంచే పండగ షురూ.. స్పెషల్ షోలు, తెలుగు కామెడీ మూవీ వరల్డ్ ప్రీమియర్
జీ తెలుగులో సంక్రాంతి హంగామా.. వీకెండ్ నుంచే పండగ షురూ.. స్పెషల్ షోలు, తెలుగు కామెడీ మూవీ వరల్డ్ ప్రీమియర్

జీ తెలుగు సంక్రాంతి సందడి

ప్రతి పండగ మాదిరిగానే ఈ సంక్రాంతి వేళ తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించడానికి జీ తెలుగు సిద్ధమైంది. కామెడీ డ్రామా 'మిత్ర మండలి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటు, టాలీవుడ్ స్టార్స్ సందడి చేసిన సంక్రాంతి స్పెషల్​ 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' ఈవెంట్‌ను అందిస్తోంది.

ప్రియదర్శి, నిహారిక ఎన్​ఎమ్​ జంటగా అలరించిన మిత్ర మండలి జనవరి 11 (ఆదివారం) మధ్యాహ్నం 3:30లకు, మాస్​మహారాజ్​ రవితేజ సందడి చేసిన 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నాయి. ప్రస్తుతం మిత్ర మండలి మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నలుగురు ఫ్రెండ్స్ జీవితాల్లోకి ఓ పొలిటీషియన్ కూతురు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ కథ.

సంక్రాంతి స్పెషల్ షోలు ఇలా..

ఇక సంక్రాంతి సంబరాలను స్టార్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుధీర్ తమదైన శైలిలో హోస్ట్ చేస్తూ వినోదాన్ని పంచబోతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి పెళ్లి, ఆశల గురించి చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. మెగా విక్టరీ సాంగ్‌ను రీక్రియేట్ చేయడంతో పాటు సుధీర్-ప్రదీప్ పట్ల అమ్మాయిలు చూపే ప్రేమ, ఒకరి అభిమానులను మరొకరు ఎగతాళి చేసుకునే సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనున్నాయి.

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' పేరుతో చిన్న పిల్లలు వేసే స్కిట్లు ఈ షోలో భాగం కానున్నాయి. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ తన హీరోయిన్లు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్‌లతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇక సాయంత్రాన్ని మరింత కలర్ ఫుల్ గా మారుస్తూ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ 'ది రాజా సాబ్' హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సరదా కబుర్లు, అల్లరి, ఆటపాటలతో సందడిగా సాగిన జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ మిస్ కాకుండా చూడండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More