ది రాజా సాబ్‌కు నెగటివ్ టాక్.. చిరంజీవికి జాక్‌పాట్.. సంక్రాంతి బరిలో ఉన్న చిన్న సినిమాలకూ కలిసి రానుందా?
ఎన్నో ఆశల మధ్య సంక్రాంతికి వచ్చిన ప్రభాస్ రి రాజా సాబ్ మూవీకి వస్తున్న నెగటివ్ రివ్యూలు ఇతర సినిమాల మేకర్స్ కు ఆశలు రేపుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజులాంటి సినిమాలకు ఇది కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన తొలి సినిమా ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 9) రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అభిమానులు తప్ప న్యూట్రల్ ప్రేక్షకులు, క్రిటిక్స్ చాలా వరకు నెగటివ్ రివ్యూలే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలకు ఇది వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన హనుమాన్, గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలాగే ఈసారి కూడా సర్‌ప్రైజ్ హిట్ ఉంటుందన్న అంచనాలు పెరిగాయి.

చిరంజీవికి కలిసి వస్తుందా?
ప్రభాస్ 'ది రాజా సాబ్' రివ్యూలు నేరుగా చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. పండగకి ఒక పెద్ద సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్, మొదటి ఆప్షన్ నిరాశపరచడంతో, ఆటోమేటిక్‌గా రెండో పెద్ద సినిమా అయిన చిరంజీవి సినిమా వైపు చూస్తారు.
ఇప్పటికే చిరంజీవి సినిమాకి టికెట్ రేట్లు పెంచలేదని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు 'రాజా సాబ్' పై నెగటివ్ టాక్ రావడంతో, తక్కువ రేట్లకు అందుబాటులో ఉన్న చిరు సినిమాకే సామాన్య ప్రేక్షకులు ఓటేసే అవకాశం ఉంది.
పైగా అనిల్ రావిపూడి-చిరు కాంబినేషన్ కాబట్టి వినోదానికి లోటు ఉండదని, ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ సినిమాను ఎంచుకునే ఛాన్స్ ఉంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.
చిన్న సినిమాలకూ గోల్డెన్ ఛాన్స్
ఇక ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే.. అది సంక్రాంతి బరిలో ఉన్న చిన్న సినిమాలు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలకు లబ్ధి చేకూరనుంది.
జాతిరత్నాలు తర్వాత నవీన్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ అనగనగా ఒక రాజు. పెద్ద సినిమాల్లో సీరియస్ నెస్, లేదా నిరాశ ఎదురైతే.. జనం నవ్వుకోవడానికి ఈ సినిమాకే క్యూ కడతారు. పండగ రోజుల్లో కామెడీ ఎప్పుడూ కింగ్. అటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ కూడా ఇదే ఆశతో ఉంది. రాజా సాబ్ స్క్రీన్స్ తగ్గుముఖం పడితే, ఆ థియేటర్లు ఈ చిన్న సినిమాలకు దొరుకుతాయి.
రెండేళ్లుగా ఇలాగే..
రెండేళ్లుగా సంక్రాంతికి సర్‌ప్రైజ్ హిట్ వస్తోంది. 2024లో హనుమాన్, 2025లో సంక్రాంతికి వస్తున్నాం ఇలాగే బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా 'రాజా సాబ్' వెనకబడితే.. నవీన్ పోలిశెట్టి సినిమా గానీ, చిరంజీవి సినిమా గానీ ఆ 'సర్ప్రైజ్ విన్నర్' స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా 'అనగనగా ఒక రాజు' ఈసారి 'హనుమాన్' లాంటి మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా జనవరి 13న రాబోతోంది. నిజానికి ఈ సినిమాలన్నింటికీ రాజా సాబ్ ఏం చేస్తాడో అన్న ఆందోళన కలిగే ఉంటుంది. కానీ ఈ సినిమా రివ్యూలు వాళ్లకు ఓ వరంలా మారబోతున్నాయన్నది మాత్రం నిజం. మరి ఆ అవకాశాన్ని ఏ మూవీ అందిపుచ్చుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


