ఇటు సినిమా రిలీజ్.. అటు పశుపతి నాథ్ ఆలయంలో ది రాజా సాబ్ విలన్ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్
ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ మూవీ రిలీజ్ రోజే నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన రాజా సాబ్ శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించాడు. శుక్రవారం (జనవరి 9) ఉదయం అతడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఒకవైపు అతడు కీలక పాత్రలో నటించిన ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తుండగా.. సంజు బాబా దైవ దర్శనంలో కనిపించడం విశేషం.

ఆలయం వద్ద భారీ రద్దీ.. సంజు బాబా సింపుల్ లుక్
కాఠ్మండులో ఒక క్యాసినో ప్రారంభోత్సవం కోసం వెళ్లిన సంజయ్ దత్.. ఈ సందర్భంగా శివయ్యను దర్శించుకున్నాడు. గురువారం (జనవరి 8) సాయంత్రమే నేపాల్ చేరుకున్న సంజయ్ దత్.. శుక్రవారం ఉదయం పశుపతినాథ్ ఆలయానికి వెళ్లాడు. అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంజయ్ దత్ చాలా సాదాసీదాగా కనిపించాడు. తెల్లటి దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు, భుజాన సంప్రదాయ అంగవస్త్రంతో భక్తిభావంతో ఆలయం నుంచి బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేపాల్‌లో కూడా అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఒకవైపు 'ధురంధర్'.. మరోవైపు 'రాజా సాబ్'
సంజయ్ దత్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమాలో సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అనే పవర్-ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.
ఇక శుక్రవారం (జనవరి 9) విడుదలైన ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో సంజయ్ దత్ ఒక భయంకరమైన హిప్నోటిస్ట్ పాత్రలో, మెయిన్ విలన్‌గా కనిపిస్తున్నాడు.
ప్రభాస్ ఏమన్నాడంటే?
'ది రాజా సాబ్'లో సంజయ్ దత్ నటన గురించి ప్రభాస్ గతంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సంజయ్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే చాలు.. ఇంకేం అవసరం లేదు. కెమెరా క్లోజప్ ఆయన మీద పెడితే స్క్రీన్ మొత్తం ఆయనే ఆక్రమించేస్తారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన సీన్స్ చూసి, నా సీన్స్ నేనే మర్చిపోయాను" అని ప్రభాస్ ప్రశంసించాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్'లో సంజయ్ దత్‌తో పాటు బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కూడా నటించారు.
అయితే ఈ సినిమాకు చాలా వరకు నెగటివ్ రివ్యూలే వస్తున్నాయి. సినిమా నిడివితోపాటు కామెడీ పండకపోవడం, వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉండటం, మ్యూజిక్ బాగా లేకపోవడం మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ప్రభాస్ ఒక్కడే తన భుజాలపై మూవీని మోసినా.. అది సరిపోలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


