ఓటీటీలోకి ది రాజా సాబ్-స్ట్రీమింగ్ అక్క‌డే-రైట్స్‌కు క‌ళ్లు చెదిరే రేట్‌-ఎప్ప‌టి నుంచో తెలుసా?

కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చేశాడు ప్రభాస్. ది రాజా సాబ్ అంటూ ఈ రోజు నుంచే థియేటర్లో సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ పైనా ఇంట్రెస్ట్ పెరిగింది. డిజిటల్ రైట్స్ కు కళ్లు చెదిరే రేటు పలికినట్లు తెలిసింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి, ఎప్పుడొస్తుందో చూసేయండి. 

Published on: Jan 9, 2026, 13:52:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొంతకాలంగా ఫుల్ యాక్షన్, మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ది రాజా సాబ్ తో తెరపై కొత్తగా కనిపించాడు. వింటేజీ లుక్ తో పాటు కామెడీ టైమింగ్, డ్యాన్స్ లతో ఇరగదీశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఓటీటీ వివరాలు, డిజిటల్ రైట్స్ రేట్ గురించి తెలుసుకుందాం.

రాజా సాబ్  లో ప్రభాస్
రాజా సాబ్ లో ప్రభాస్

రాజా సాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది రాజా సాబ్ చిత్రంపై మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ లో రిలీజ్ కానుంది. ది రాజా సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.

టీవీలో ఎక్కడ?

ది రాజా సాబ్ డిజిటల్ రైట్స్ ను జియోహాట్‌స్టార్‌ దక్కించుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. అంటే టీవీలో ది రాజా సాబ్ మూవీని స్టార్ మా ఛానెల్లో చూడొచ్చన్నమాట. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ మూవీ టీవీ ప్రీమియర్ కు వచ్చే అవకాశముంది.

డిజిటల్ రైట్స్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ది రాజా సాబ్ పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ కావడం, ప్రభాస్ కూడా వింటేజ్ లుక్ లో అదరగొట్టడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలిపి సుమారు రూ.180 నుంచి రూ.200 కోట్ల వరకు పలికినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కంటే ముందు మంచి డీల్ కుదిరిందని టాక్.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి రెండో వారం నుంచి నాలుగో వారం మధ్యలో ది రాజా సాబ్ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చే అవకాశముంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత మంచి అకేషన్ చూసి టీవీల్లో స్ట్రీమింగ్ చేస్తారు.

ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More