డైరెక్ట్ ఓటీటీలోకి హార్ట్ టచింగ్ మూవీ.. మ్యూజిక్ ప్లస్ ఎమోషన్.. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో.. జోడీగా స్టార్ కపుల్

దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఓ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతోంది. మ్యూజిక్, ఎమోషన్ కలగలిపి ఈ మూవీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బుల్లితెరపై స్టార్ కపుల్ అనిపించుకున్న జోడీ యాక్ట్ చేసింది. 

Published on: Oct 31, 2025, 20:00:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫరెంట్ జానర్ సినిమాలతో డిజిటల్ ఆడియన్స్ ను ఎప్పటికప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది ఈటీవీ విన్. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మరో మూవీ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు రానుంది. మ్యూజిక్ ప్లస్ ఎమోషన్ తో తీర్చిదిద్దిన చిన్న సినిమా ‘సింధు భైరవి’ డిజిటల్ స్ట్రీమింగ్ కు టైమ్ దగ్గరపడింది. ఈ మూవీకి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం.

ఓటీటీలోకి హార్ట్ టచింగ్ మూవీ (x/etvwin)
ఓటీటీలోకి హార్ట్ టచింగ్ మూవీ (x/etvwin)

సింధు భైరవి ఓటీటీ

మ్యూజికల్ ఎమోషనల్ మెలోడీగా తెరకెక్కించిన సింధు భైరవి సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ నవంబర్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధలో భాగంగా ప్రతి ఆదివారం కొత్త షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సింధు భైరవి స్ట్రీమింగ్ కానుంది.

స్టార్ కపుల్

సింగ‌ర్ కృష్ణ చైత‌న్య‌, అయ్యంగార్ మృదుల‌ అంటే బుల్లి తెర ఫ్యాన్స్ కు పరిచయమే. కృష్ణ చైత‌న్య‌ సినిమాల్లో పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మృదుల‌ యాంకర్ గా, యూట్యూబ్ వీడియోలతో పాపులర్. ఈ జోడీ తరచుగా టీవీ షోల్లో కనిపిస్తోంది. అందుకే టీవీ ఆడియన్స్ కు వీళ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రియల్ లైఫ్ కపుల్ ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ భార్యభర్తలుగా నటించారు.

మ్యూజిక్ కపుల్

కృష్ణ చైత‌న్య‌, అయ్యంగార్ మృదుల‌ కలిసి తొలిసారి ఓ మూవీ చేశారు. సింధు భైరవిలో వీళ్లవే లీడ్ రోల్స్. ఈ సినిమాలో మ్యూజిక్ అంటే ప్రాణమిచ్చే కపుల్ గా వీళ్లు కనిపించబోతున్నారు. వీళ్లకు కూతురుగా పరిణీత నటించింది. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ, ప్రొడ్యూసర్ కూడా రాఘవేంద్రరావు కావడం విశేషం. సాయి తేజ డైరెక్టర్. సాయి మధుకర్ మ్యూజిక్ అందించాడు.

హార్ట్ టచింగ్

మ్యూజిక్ పై లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సింధు భైరవిని హార్ట్ టచింగ్ మూవీగా తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో కృష్ణ చైత‌న్య‌, అయ్యంగార్ మృదుల‌ కలిసి పాటలు పాడుతుంటారు. కానీ వాళ్ల కూతురు పుస్తకంలో బొమ్మలు వేసుకుంటుంది. ఆ తర్వాత కన్నీళ్లు, నిరాశ ఇలా వివిధ రకాల ఎమోషన్స్ ను చూపించారు. మరి సినిమాలో ఏ ఎమోషన్ పండిందో చూడాలంటే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More