నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

నెట్‌ఫ్లిక్స్ లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. గురువారం (అక్టోబర్ 30) ఈ సినిమా ట్రైలర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. కశ్మీర్ లోని బారాముల్లా టౌనులో జరిగే కథగా దీనిని తెరకెక్కించారు.

Published on: Oct 30, 2025, 15:46:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల కోసం మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని వచ్చే వారం స్ట్రీమింగ్ చేయనుంది. కొన్నాళ్ల కిందట ఈ సినిమా గురించి వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా గురువారం (అక్టోబర్ 30) ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది ఆసక్తికరంగా సాగింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

బారాముల్లా మూవీ ట్రైలర్

ప్రముఖ నటుడు మానవ్ కౌల్ ప్రధాన పాత్ర పోషించిన 'బారాముల్లా' మూవీ ట్రైలర్ ని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో కశ్మీర్ లోయల లోతుల్లో దాగి ఉన్న ఒక రహస్యం చుట్టూ కథ తిరగనుంది. బారాముల్లా అనే పట్టణంలో అకస్మాత్తుగా పిల్లలు అదృశ్యం కావడంతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ మిస్సింగ్ కేసులను పరిష్కరించడానికి ఓ పోలీస్ అధికారి రంగంలోకి దిగుతాడు. ఆ పాత్రనే మానవ్ కౌల్ పోషించాడు. ఈ ట్రైలర్ మిస్టరీతో కూడి ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'బారాముల్లా' ట్రైలర్ అకస్మాత్తుగా పిల్లలు అదృశ్యం కావడంతో మొదలవుతుంది. ఆ పిల్లలు ఎలా మాయమవుతున్నారు అనేది తేల్చడానికి దర్యాప్తు ప్రారంభమవుతుంది. అందరిలో భయం కూడా మొదలవుతుంది. మిస్టరీతోపాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రకమైన భయాన్ని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. సాధారణంగా హారర్ సినిమాలు సౌండ్ తో భయపెడతాయి.. కానీ ఈ బారాముల్లా నిశ్శబ్దంతోనే భయపెడుతుందని ఇందులో లీడ్ రోల్ పోషించిన మానవ్ కౌల్ అన్నాడు.

'బారాముల్లా' రియల్ స్టోరీయా?

ఈ బారాముల్లా సినిమాలో డీఎస్పీ రిద్వాన్ సయ్యిద్ పాత్ర పోషించాడు మానవ్ కౌల్. కశ్మీరు లోయల అందాలే కాదు.. వాటి వెనుక ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నట్లు ఈ సినిమా చూస్తే తెలుస్తుందని మానవ్ అన్నాడు. దీంతో ఈ మూవీ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందా అన్న సందేహం కలుగుతోంది.

"నేను బారాముల్లా నుండి వచ్చిన కశ్మీరీని కావడం వల్ల ఈ స్క్రిప్ట్ నాకు ఒక సంకేతంలా అనిపించింది. ఈ లోయ కథలను నిజాయితీతో, నిబద్ధతతో, మా ప్రేమతో చెప్పడానికి ఇది మంచి అవకాశం" అని మానవ్ కౌల్ చెప్పాడు. ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించిన 'బారాముల్లా' నేరుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా. దీనిని నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

గతంలో ఆర్టికల్ 370 అనే సినిమా తీసిన ఆదిత్య జంభాలే మంచి హిట్ కొట్టాడు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడానికి దారి తీసిన పరిస్థితుల చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది. అలాంటి డైరెక్టర్ తీసిన మూవీ కావడంతో ఈ బారాముల్లాపైనా ఆసక్తి నెలకొంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More