మహేశ్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఒక రక్త పిశాచి- వివాహ్ నుంచి ఏమాత్రం మారలేదంటూ!

మహేశ్ బాబు అతిథి సినిమాలో హీరోయిన్‌గా చేసిన బ్యూటిపుల్ బాలీవుడ్ నటి అమృత రావు తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. శ్రద్ధా కపూర్‌తో కలిసి నటించిన లేటెస్ట్ జ్యువెలరీ యాడ్‌లో అమృతను చూసిన ఫ్యాన్స్ 44 ఏళ్ల వయసులోనూ 29 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తోందంటూ తెగ పొగిడేస్తున్నారు.

Published on: Jan 15, 2026, 14:31:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెండితెరపై ‘గర్ల్ నెక్ట్స్ డోర్ (పక్కింటి అమ్మాయి)’ ఇమేజ్‌తో కోట్లాది మంది మనసు గెలుచుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ అమృత రావు. టాలీవుడ్‌లో మహేశ్ బాబు అతిథి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమృత రావు ఆ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు.

మహేశ్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఒక రక్త పిశాచి- వివాహ్ నుంచి ఏమాత్రం మారలేదంటూ!
మహేశ్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఒక రక్త పిశాచి- వివాహ్ నుంచి ఏమాత్రం మారలేదంటూ!

శ్రద్ధా కపూర్‌తో

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో అమృత రావుకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమృతకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో జ్యూవెలరీ బ్రాండ్ ‘పాల్మోనాస్’ (Palmonas) యాడ్‌లో అమృత మెరిశారు. ఇందులో అమృత యంగ్ లుక్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

బుధవారం (జనవరి 14) విడుదలైన ఈ యాడ్‌లో శ్రద్ధా కపూర్, అమృత రావు మధ్య సాగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది. కొత్త మంగళసూత్ర కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమృతను నియమించే అగ్రిమెంట్‌పై శ్రద్ధా కపూర్ అయిష్టంగానే సంతకం చేయడం, ఇద్దరి మధ్య చిన్నపాటి సరదా వాదన జరగడం ఈ వీడియోలో చూడొచ్చు.

44లో 29 ఏళ్ల యువతిలా

అయితే, ఈ వీడియోలోని కంటెంట్ కంటే అమృత రావు అందమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 44 ఏళ్ల వయసులోనూ ఆమె 2006లో వచ్చిన 'వివాహ్' సినిమా నాటి రూపంతోనే ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

"అమృత ఏమైనా వాంపైరా (బేతాళి లేదా రక్త పిశాచి)? ఎందుకంటే వివాహ్ నుంచి ఇప్పటివరకు ఏమాత్రం మారలేదు, అసలు ఒక్క రోజైనా వయసు పెరిగినట్టు అనిపించడం లేదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "శ్రద్ధా కపూర్ కంటే అమృత చిన్నపిల్లలా కనిపిస్తోంది" అని మరొకరు రాసుకొచ్చారు. "ఆమెకు 44 ఏళ్లంటే ఎవరూ నమ్మరు.. ఇప్పటికీ 29 ఏళ్ల యువతిలా ఉంది" అంటూ అమృతపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్

ఇకపోతే హిందీలో'ఇష్క్ విష్క్', 'మై హూ నా' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అమృత రావుకు 'వివాహ్' మూవీ ఇంటి పేరుగా మారిపోయింది. వివాహ్ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం మహేష్ బాబుతో అమృత రావు అతిథి సినిమా చేయడం విశేషం.

ఇక 2019లో వచ్చిన 'ఠాక్రే' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమృత రావు 2025లో విడుదలైన 'జాలీ ఎల్ఎల్‌బీ 3' (Jolly LLB 3)తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

అమృత రావు అందం రహస్యం

కాగా, అమృత రావు తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని ఏదో ఒక రోజు వెల్లడిస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘ఏజ్ లెస్’ బ్యూటీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More