Sign in

15 కిలోలు పెరిగిన సాహో హీరోయిన్, భారీ ఆభరణాలతో డ్యాన్స్, కాలుకు ఫ్రాక్చర్- హెల్త్ అప్డేట్ ఇచ్చిన శ్రద్ధా కపూర్

ప్రభాస్ సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ షూటింగ్‌లో గాయపడింది. ఈఠా అనే బాలీవుడ్ సినిమా సెట్‌లో గాయపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తన ఆరోగ్య పరిస్థితి చెబుతూ వీడియో రిలీజ్ చేసింది బ్యూటిపుల్ శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Nov 24, 2025, 11:20:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సాహో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఆ తర్వాత తెలుగు సినిమా చేయని ఈ బ్యూటి హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే, రీసెంట్‌గా శ్రద్ధా కపూర్ షూటింగ్ సెట్‌లో గాయపడింది.

15 కిలోలు పెరిగిన సాహో హీరోయిన్, భారీ ఆభరణాలతో డ్యాన్స్, కాలుకు ఫ్రాక్చర్- హెల్త్ అప్డేట్ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ((Instagram/ Shraddha Kapoor))
15 కిలోలు పెరిగిన సాహో హీరోయిన్, భారీ ఆభరణాలతో డ్యాన్స్, కాలుకు ఫ్రాక్చర్- హెల్త్ అప్డేట్ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ((Instagram/ Shraddha Kapoor))

ఈఠా మూవీ సెట్‌లో

శ్రద్ధా కపూర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఈఠా. నవంబర్ 22న ఈఠా సెట్‌లో శ్రద్ధా కపూర్ గాయపడినట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. తాజాగా తన గాయంపై హెల్త్ అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్. కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చింది.

కాలికి ప్లాస్టరింగ్ చేసిన వీడియో

అలాగే, తన అప్‌కమింగ్ సినిమా గురించి వెల్లడించింది శ్రద్ధా కపూర్. అయితే, శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ క్వషన్ సెషన్‌ను నిర్వహించింది. అందులో అనేక అభిమానుల ప్రశ్నలకు శ్రద్ధా సమాధానం ఇచ్చింది. అలాగే, ఫ్యాన్స్ తన కాలు గాయం గురించి అప్ డేట్ అడిగినప్పుడు శ్రద్ధ కపూర్ తన కాలును ప్లాస్టరింగ్ చేసిన వీడియోను పంచుకుంది.

టెర్మినేటర్‌లా తిరుగుతున్నా

"నేను టెర్మినేటర్‌లాగా తిరుగుతున్నాను. నా కండరాలు చితికిపోయాయి ఇది కండరాల కన్నీరు. కానీ, త్వరలో నయం అవుతుంది. నాకు కొంచెం విశ్రాంతి అవసరం. నేను పూర్తిగా కోలుకుంటాను" అని శ్రద్ధా కపూర్ అభిమానులతో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎడమ కాలి వేళ్లకు

ఇదిలా ఉంటే, ఈఠా సినిమాలో కీలకమైన లవణీ సాంగ్ సీక్వెన్స్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా శ్రద్ధా కపూర్ గాయపడింది. శ్రద్ధా కపూర్ ఎడమ కాలి వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. దాంతో సాహో బ్యూటీని రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచించారు. ఈ కారణంగా ఈఠా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

భారీ ఆభరణాలతో డ్యాన్స్

అజయ్-అతుల్ కంపోజ్ చేసిన లవణీ సాంగ్‌ను సాంప్రదాయ నౌవరీ చీర, భారీ ఆభరణాల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో కష్టమైందని, ఈ క్రమంలోనే గాయపడినట్లు శ్రద్ధా కపూర్ తెలిపింది. అలాగే, ఈఠా మూవీలో తన పాత్ర కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు శ్రద్ధా కపూర్ పేర్కొంది.

ఒప్పుకోని దర్శకుడు

అయితే, షూటింగ్‌లో గాయపడిన కూడా క్లోజప్ షాట్స్ కంప్లీట్ చేయాలని శ్రద్ధా కపూర్ కోరిందట. కానీ, డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అందుకు అంగీకరించలేదని సమాచారం. గాయం మరింత ముదిరే అవకాశం ఉంటుందని షూటింగ్‌ను నిలిపివేశారు ఈఠా మూవీ మేకర్స్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More