ఫేక్ ఆడిషన్స్‌తో 9 మంది యువతుల హత్య-నేరుగా ఓటీటీలోకి తమిళ సైకలాజికల్ థ్రిల్లర్-ఇవాళ నుంచే స్ట్రీమింగ్
పాపులర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి ఓ తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా వచ్చేస్తోంది. ఇవాళ స్ట్రీమింగ్ కు రానుంది. 9 మంది యువతులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ కథతో ఈ మూవీ తెరకెక్కింది.
ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘స్టీఫెన్’. ఈ సినిమా శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. ఇది నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

స్టీఫెన్ ఓటీటీ
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ స్టీఫెన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది అందుబాటులోకి వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కే వస్తుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్టీఫెన్ మూవీ ఆడియన్స్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది.
సీరియల్ కిల్లర్ స్టోరీ
'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్ ప్రకారం.. ఒక న్యూస్ రీడర్ వాయిస్ యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.
అతను తొమ్మిది మంది మహిళలను దారుణంగా హత్య చేసినట్లు తేలుతుంది. అయితే ఆ హత్యలు ఎందుకు, ఎవరితో కలిసి చేశాడు అనే ప్రశ్నల చుట్టూ తిరిగే ఈ కథనం ఆసక్తి రేపుతోంది. అసలు అతడు అన్ని హత్యలు చేసిన తర్వాత తనకు తానుగా ఎందుకు లొంగిపోయాడు అన్నది కూడా మూవీలో ఆసక్తి రేపే అంశం కానుంది.
ఫేక్ ఆడిషన్
స్టీఫెన్ మూవీ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ సీరియల్ కిల్లర్ కథతో తెరకెక్కింది. ఫేక్ ఆడిషన్స్ పేరుతో 9 మంది యువతులను స్టీఫెన్ హత్య చేస్తాడు. ఈ సీరియల్ హత్యలు కలకలం రేపుతాయి. అసలు ఈ హత్యలు ఎందుకు? ఎవరు? చేశారన్నది మిస్టరీగా మారుతుంది. కానీ స్టీఫెన్ లొంగిపోవడం పెద్ద ట్విస్ట్ గా మారుతుంది. స్టీఫెన్ కు మానసిక ఆరోగ్య సమస్య ఉందనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది.
రీసెంట్ గా సౌత్ మూవీస్ కు నెట్‌ఫ్లిక్స్ బాగానే ప్రియారిటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే స్టీఫెన్ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్ ను ఇష్టపడే ఆడియన్స్ కు స్టీఫెన్ మూవీ మంచి ఆప్షన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


