నెట్‌ఫ్లిక్స్‌లోకి తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నెట్‌ఫ్లిక్స్‌లోకి ఓ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. తాజాగా బుధవారం (నవంబర్ 26) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. అమ్మాయిలను హత్య చేసే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే సినిమా ఇది.
నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్యే సౌత్ భాషల్లో ఒరిజనల్ కంటెంట్ పెంచుతోంది. అలా తమిళంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు స్టీఫెన్. బుధవారం (నవంబర్ 26) మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. గతంలో ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ట్రైలర్ తో మరింత ఆసక్తి రేపారు.

సీరియల్ కిల్లర్ స్టోరీగా స్టీఫెన్
'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆ ఓటీటీ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్ వాయిస్‌తో మొదలవుతుంది. యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.
అతను తొమ్మిది మంది మహిళలను దారుణంగా హత్య చేసినట్లు తేలుతుంది. అయితే ఆ హత్యలు ఎందుకు, ఎవరితో కలిసి చేశాడు అనే ప్రశ్నల చుట్టూ తిరిగే ఈ కథనం ఆసక్తి రేపుతోంది. అసలు అతడు అన్ని హత్యలు చేసిన తర్వాత తనకు తానుగా ఎందుకు లొంగిపోయాడు అన్నది కూడా మూవీలో ఆసక్తి రేపే అంశం కానుంది.
స్టీఫెన్ మూవీ గురించి..
అరంగేట్ర దర్శకుడు మిథున్ బాలాజీ ఈ స్టీఫెన్ మూవీకి దర్శకత్వం వహించాడు. గోమతి శంకర్ టైటిల్ రోల్‌లో నటించాడు. ఇదే అతనికి తొలి లీడ్ రోల్. గోమతి శంకర్ తోపాటు మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తన పాత్ర గురించి నటుడు గోమతి శంకర్ మాట్లాడుతూ.. "స్టీఫెన్ సాధారణ లీడ్ రోల్ కాదు. ఆ పాత్రలో చాలా లేయర్స్, ఊహించలేని స్వభావం ఉన్నాయి. అతని పాత్ర ఎప్పుడూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఆ పాత్రలోకి అడుగుపెట్టడం ఉత్సాహంగా, సవాలుగా, సంతృప్తికరంగా అనిపించింది. నేను కూడా సహ రచయితగా ఉండటం వల్ల ఆ పాత్రకు మరింత సులభంగా అనుగుణంగా మారగలిగాను" అని తెలిపాడు.
దర్శకుడు మిథున్ బాలాజీ తన మొదటి సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు. "స్టీఫెన్ నిశ్శబ్దంగా సాగిపోయే సినిమా. కానీ ఇది నేరం, జ్ఞాపకాలు, మధ్యలో వేధించే ప్రతి అంశం గురించి చెబుతుంది. ఈ కథ చెప్పడం నాకు వ్యక్తిగతమైనది. కాస్త రిస్క్‌తో కూడుకున్నదిగా అనిపించింది. అందుకే ఇది మరింత ఎక్సైటింగ్‌గా మారింది" అని వివరించాడు.
ఓ కొత్త డైరెక్టర్, తొలిసారి లీడ్ రోల్లో నటించిన నటుడితో నెట్‌ఫ్లిక్స్ ఓ ఒరిజినల్ మూవీ తీయడం విశేషమే. ఇదే స్టీఫెన్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


