సర్‌ప్రైజ్-సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్-బలి కోరే ధన పిశాచి
ఓటీటీ ఆడియన్స్ కు బిగ్ సర్ ప్రైజ్. ఎలాంటి హడావుడి లేకుండా సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి జటాధర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
రీసెంట్ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘జటాధర’ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి చప్పుడు లేకుండా సైలెంట్ గా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. ఇందులో సుధీర్ బాబు హీరో. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇందులో పిశాచిగా నటించింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.

జటాధర ఓటీటీ
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ జటాధర ఓటీటీలో అడుగుపెట్టింది. ధన పిశాచి నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది.
థియేటర్ రెస్పాన్స్
జటాధర సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఇదే తొలి తెలుగు మూవీ. పైగా హారర్ థ్రిల్లర్ కథాంశం కావడంతో జటాధరపై ముందే నుంచే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ మూవీ థియేటర్లలో అంచనాలు అందుకోలేకపోయింది. సుమారు రూ.18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జటాధర చివరకు రూ.6 కోట్లకు అటూఇటూగా కలెక్షన్లు సాధించింది.
జటాధర స్టోరీ
దెయ్యాలు లేవని నమ్మే ఓ యువకుడికి, ధన పిశాచికి మధ్య జరిగే పోరాటమే జటాధర సినిమా. శివ (సుధీర్ బాబు) ఓ ధైర్యవంతుడైన యువకుడు. దెయ్యాలు, ఆత్మలు లేవని, అవి కేవలం భ్రమలు మాత్రమేనని నమ్ముతాడు. పారా నార్మాల్ సొసైటీ ద్వారా దెయ్యాలు లేవని నిరూపించాలని చూస్తాడు. ఆ క్రమంలోనే దెయ్యాలున్నాయనే ప్రచారం సాగుతున్న రుద్రారం ఊరిలోకి వస్తాడు.
ధన పిశాచి
మరోవైపు పూర్వ కాలంలో నిధులకు కాపలాగా పిశాచ బంధనం వేసేవాళ్లనే కథ ఇంట్రెస్టింట్ గా ఉంటుంది. అలాగే ఓ ధన పిశాచి (సోనాక్షి సిన్హా)ని కాపలాగా ఉంచుతారు. ఇక రుద్రారం వెళ్లిన శివకు ఓ చిన్నారి హత్య కలలోకి వస్తుంది. మరి ఆ చిన్నారి ఎవరు? శివకు ఆ ఊరికి సంబంధం ఏంటీ? ధన పిశాచికి శివకు మధ్య పగ ఉందా? అనేది సినిమాలో చూడాల్సిందే.
జటాధర మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కూడా కొత్త పాత్రలో కనిపించింది. మరి ఇంకెందుకు లేటు హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ ప్రైమ్ వీడియోలో జటాధర సినిమాపై ఓ లుక్కేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


