నా అకౌంట్లో డబ్బులు లేవు.. అందుకే హీరోనయ్యాను: విజయ్ సేతుపతి కామెంట్స్‌తో పడీపడీ నవ్విన కపిల్ శర్మ

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నటుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెబుతూ అతడు వేసిన జోక్‌కు కపిల్ శర్మతో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. ఆ ఆసక్తికర సంఘటన, ‘గాంధీ టాక్స్’ సినిమా వివరాలు తెలుసుకోండి.

Published on: Jan 26, 2026, 18:00:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ సేతుపతి తన నెక్ట్స్ మూవీ ‘గాంధీ టాక్స్’ ప్రచారంలో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో సందడి చేయబోతున్నాడు. అతనితో పాటు ఆ సినిమా సహ నటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో విజయ్ సేతుపతి తాను ఎందుకు నటుడిని అయ్యానో చెప్పిన విధానం నవ్వు తెప్పించింది.

నా అకౌంట్లో డబ్బులు లేవు.. అందుకే హీరోనయ్యాను: విజయ్ సేతుపతి కామెంట్స్‌తో పడీపడీ నవ్విన కపిల్ శర్మ
నా అకౌంట్లో డబ్బులు లేవు.. అందుకే హీరోనయ్యాను: విజయ్ సేతుపతి కామెంట్స్‌తో పడీపడీ నవ్విన కపిల్ శర్మ

అకౌంటెంట్ నుంచి యాక్టర్‌గా..

ఆ వీడియోలో కపిల్ శర్మ.. విజయ్ సేతుపతిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. "మీరు ఎప్పుడైనా ఏదైనా యాక్టింగ్ స్కూల్ కు వెళ్ళారా అని ప్రశ్నించాడు. దానికి విజయ్ బదులిస్తూ.. తాను ఎప్పుడూ వెళ్లలేదని, దానికి బదులుగా ఒక నాటక బృందంలో లెక్కలు రాసే అకౌంటెంట్ గా పనిచేశానని చెప్పాడు.

అప్పుడు కపిల్ శర్మ.. "మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు ఎవరైనా పెద్ద నటుడి బ్యాంకు ఖాతా వివరాలు చూసి, స్ఫూర్తి పొంది నటన వైపు వచ్చారా?" అని సరదాగా అడిగాడు. దానికి విజయ్ సేతుపతి ఇచ్చిన సమాధానం అదిరిపోయింది. "లేదు, నేను నా బ్యాంకు ఖాతా చూసుకున్నాను. అందులో అసలు డబ్బే లేదు. అందుకే డబ్బు సంపాదించడానికి ఇలా నటుడిగా మారాను" అని బదులిచ్చాడు.

చప్పట్లు కొట్టిన సహనటులు..

విజయ్ సేతుపతి నిజాయతీగా, చమత్కారంగా చెప్పిన ఈ సమాధానం విని పక్కనే ఉన్న సహ నటులు సిద్ధార్థ్ జాదవ్, అదితి రావు హైదరీ ఆశ్చర్యపోయారు. వారు తమ నవ్వు ఆపుకోలేక గట్టిగా చప్పట్లు కొట్టారు. కపిల్ శర్మ కూడా ఆ సమాధానానికి ముగ్ధులై గట్టిగా నవ్వేశాడు.

ఈ వీడియో చూసిన అభిమానులు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ ను నింపేశారు. కపిల్ శర్మ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తన టీమ్ తో కలిసి అతడు ‘గాంధీ టాక్స్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ ఎపిసోడ్ జనవరి 31న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

‘గాంధీ టాక్స్’ గురించి..

‘గాంధీ టాక్స్’ సినిమా గురించి చెప్పాలంటే.. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దీనికి దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, క్యూరియస్, మూవీమిల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో డైలాగులు ఉండవు. ఇది ఒక మూకీ కావడం విశేషం.

ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 2023లో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమా.. ఎట్టకేలకు జనవరి 30న అంటే ఈ వారమే థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More