OTT: నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వ‌ర‌కు- ఒక్కో ఓటీటీలో ఒక్కో బ్లాక్ బస్టర్- రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లు-చూశారా?

ఓటీటీలో కొత్త సినిమాలు అదరగొడుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ కు కిక్ అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వ‌ర‌కు ఒక్కో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒక్కో బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లరున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. 

Published on: Jan 25, 2026, 18:29:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు సత్తాచాటుతున్నాయి. ఒక్కో ఓటీటీలో ఒక్కో బ్లాక్ బస్టర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా వేర్వేరు జోనర్లలోని సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఏవి? వీటిని మీరు చూశారా? అని చెక్ చేసుకోండి.

ఓటీటీలోని బ్లాక్ బస్టర్లు
ఓటీటీలోని బ్లాక్ బస్టర్లు

తేరే ఇష్క్ మే ఓటీటీ

తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన మరో మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజైంది ఈ చిత్రం. కృతి స‌న‌న్‌ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ మోసం చేసిందని తెలుసుకున్నాక హీరో ఎలా మారాడు? అనేది తేరే ఇష్క్ మే లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

సిరై

ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో తమిళ సూపర్ హిట్ మూవీ సిరై కూడా ఉంది. ఇది క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో హెడ్ కానిస్టేబుల్ కదిరవన్ నిజాయితీగా ఉంటాడు. ఓ హత్య కేసులో నిందితుణ్ని జైలు నుంచి కోర్టుకు అతను తీసుకెళ్తాడు. కానీ ఆ నిందితుడు నిర్దోషి అని తెలిసినప్పుడు ఆ కానిస్టేబుల్ ఏం చేశాడన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జీ5 ఓటీటీలో ఉంది.

మార్క్

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మార్క్ జియోహాట్ స్టార్ లో సత్తాచాటుతోంది. ఇందులో కిచ్చా సుదీప్ తో పాటు నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. ఈ కన్నడ సినిమా ఓటీటీలో తెలుగులోనూ ఉంది. సస్పెండ్ అయినప్పటికీ డ్రగ్స్ నెట్ వర్క్, 20 మంది చిన్నపిల్లల కిడ్నాప్ ను ఛేదించే పోలీస్ కథ ఇది.

చీకటిలో

ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసిన మరో సినిమా ‘చీకటిలో’. శోభితా ధూళిపాళ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇందులో హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ నిర్వహిస్తుంది. చీకటిలో వచ్చి అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ గురించి చెప్తుంటుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అన్నది చీకటిలో సినిమాలో చూడాల్సిందే.

శంబాల ఓటీటీ

ఈ వారం తెలుగు ఆడియన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన ఓటీటీ రిలీజ్ మూవీ ‘శంబాల’. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ సాధించింది. ఆకాశంలో నుంచి ఓ ఉల్క శంబాల అనే గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత అక్కడ వింత సంఘటనలు, హత్యలు జరుగుతాయి. దెయ్యం అని జనాలు భయపడతారు. మరి అప్పుడు జియాలజిస్ట్ అయిన హీరో ఏం చేశాడు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More