OTT Crime: ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్- భర్త శవం- డేంజరస్ క్రిమినల్‌తో నలుగురు మహిళల పోరాటం- వయోలెంట్ యాక్షన్‌తో!

ఓటీటీలోకి నిన్న (జనవరి 23) క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాళీపోట్కా. ఒక్క శవంతో నలుగురు మహిళల జీవితం తారుమారు అవడం, బతకడం కోసం డేంజరస్ క్రిమినల్‌తో పోరాటం చేయడం వంటి అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. మరి కాళీపోట్కా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 24, 2026, 05:35:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరోలు అదిరిపోయే యాక్షన్ చేయడం చూసే ఉంటాం. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, భావోద్వేగాల కలయిక మనల్ని టీవీ స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేస్తాయి.

ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్- భర్త శవం- డేంజరస్ క్రిమినల్‌తో నలుగురు మహిళల పోరాటం- వయోలెంట్ యాక్షన్‌తో!
ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్- భర్త శవం- డేంజరస్ క్రిమినల్‌తో నలుగురు మహిళల పోరాటం- వయోలెంట్ యాక్షన్‌తో!

బతకడం కోసం

అయితే, నలుగురు సాధారణ మహిళలు బతకడం కోసం మరి వయోలెంట్ యాక్షన్‌లోకి దిగితే. అలాంటి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిన్న (జనవరి 23) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వెబ్ సిరీసే కాళీపోట్కా (Kaalipotka).

బెంగాలీలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్ కాళీపోట్కా. కాళీమాతకు పూజ చేసే సమయంలో పేల్చే ఒక చిన్న టపాసును కాళీపోట్కా అంటారని తెలుస్తోంది. కాళీపోట్కా సిరీస్‌లో ప్రముఖ బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ, శ్రుతి దాస్, శ్రేయా భట్టచార్య, హిమికా బోస్ ప్రధాన పాత్రలు పోషించారు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో

వీరితోపాటు అనిర్బన్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఒక్క శవంతో నలుగురి మహిళల జీవితాలు మారిపోవడం, ఆ శవం ఆ నలుగురి ఆడవాళ్ల భర్తల్లో ఒకరిది కావడం వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను రూపొందించారు అభిరూప్ ఘోష్.

ఆ తర్వాత ఓ డేంజరస్ క్రిమినల్‌తో నలుగురు మహిళలు చేసే పోరాటంగా కాళీపోట్కాను మలిచారు. రివేంజ్, అదిరిపోయే వయోలెంట్ యాక్షన్‌, సస్పెన్స్ అంశాలతో కాళీపోట్కా ఆకట్టుకునేలా ఉంటుందని సిరీస్ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఒక్క శవం.. నలుగురు మహిళలు!

కాళీపోట్కా కథలోకి వెళితే.. శ్రీమ, రాణి, రింకూ, మినోటి.. ఈ నలుగురు మహిళలు వేర్వేరు జీవితాలు గడుపుతుంటారు. సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వీరు, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తుంటారు.

అయితే, మినోటి భర్త అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వీరి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి. ఆ శవాన్ని ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్న వీరు, అనుకోకుండా అబద్ధాల వలయంలో చిక్కుకుంటారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూనే, మరోవైపు ఒక డేంజరస్ నేరస్థుడు రాణా (అనిర్బన్ చక్రవర్తి) బారి నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు? అన్నదే ఈ సిరీస్ ఇతివృత్తం.

కాళీపోట్కా ఓటీటీ స్ట్రీమింగ్

ఈ ఓటీటీ సిరీస్‌లో మహిళలను సాధారణ ఆడవాళ్లుగా కాకుండా, అత్యంత ధైర్యవంతులుగా, మహిళా శక్తి ఎలా ఉంటుందో చూపించారని రివ్యూలు వచ్చాయి. వ్యవస్థలోని లోపాలను, పక్షపాతాలను ఎదురిస్తూ వారు ప్రదర్శించిన తెగింపు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇలాంటి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ కాళీపోట్కా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో కాళీపోట్కా ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కేవలం బెంగాళీ భాషలో మాత్రమే కాళీపోట్కా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More