నీలకంఠ రివ్యూ- హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్, హీరోయిన్ స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ- యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన సినిమా నీలకంఠ. హీరోయిన్ స్నేహ ఉల్లాల్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జనవరి 2) థియేటర్లలో నీలకంఠ మూవీ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నీలకంఠ రివ్యూలో చూద్దాం.
టైటిల్: నీలకంఠ

నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, యష్ణ ముతులూరి, నేహా పఠాన్, స్నేహ ఉల్లాల్, రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం: రాకేష్ మాధవన్
సంగీతం: మార్క్ ప్రశాంత్
ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్
నిర్మాతలు: మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్
ప్రొడక్షన్ బ్యానర్: ఎల్ఎస్ ప్రొడక్షన్స్
విడుదల తేది: జనవరి 2, 2026
టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి నటించిన లేటెస్ట్ సినిమా నీలకంఠ. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. యష్ణ ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్స్‌గా చేసిన నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.
ట్రైలర్, టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న నీలకంఠ సినిమా ఇవాళ (జనవరి 2) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో నేటి నీలకంఠ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సరస్వతిపురం అనే ఒక గ్రామంలో కట్టుబాట్లకు అంతా చాలా విలువ ఇస్తారు. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే గ్రామ పెద్ద రాఘవయ్య (రాంకీ) కఠినమైన శిక్షలు విధిస్తాడు. అదే ఊరిలో టైలర్ వృత్తి చేసుకొనే నాగ భూషణం (కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్ ) పదో తరగతిలో ఓ తప్పు చేస్తాడు.
దాని ఫలితంగా 15 సంవత్సరాలు ఊరు నుంచి బయటికి పోకుండా ఉండాలని, ఇంకా ఎప్పుడు నీలకంఠ చదువుకోవడానికి వీలులేదని శిక్ష వేస్తారు. బాగా చదివ ఊరికి పేరు తీసుకొస్తా అని అమ్మకు ఇచ్చిన మాటను నెరవేర్చలేనందుకు బాధపడుతాడు నీలకంఠ. చదువుకు దూరమైన నీలకంఠ కబడ్డీ పోటీల్లో గెలుస్తాడు. కానీ, మండల స్థాయికి వెళ్లలేకపోతాడు.
ప్రేమించిన సీత (యష్ణ ముతులూరి) కూడా చదువు నిమిత్రం విదేశాలకు వెళ్తుంది. ఈ క్రమంలో 15 ఏళ్లకు నీలకంఠ శిక్ష ముగుస్తుంది. ఆ తర్వాత నీలకంఠ ఏం చేశాడు? సీతను పెళ్లి చేసుకున్నాడా? సర్పంచ్‌గా నీలకంఠ ఎందుకు నిలుచున్నాడు? నీలకంఠ చేసిన తప్పు ఏంటీ? అమ్మకు ఇచ్చిన మాట నెరవేర్చాడా? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకి కోర్ పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మనం అన్ని సినిమాల్లో తప్పు చేస్తే ఊరు నుంచి వెలివేయడం చూశాం. కానీ ఈ కథలో ఊరి నుంచి బయటికి పోకుండా ఆ తప్పు చేసిన వాడికి ఇష్టమైంది దూరం చేయడం అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంది.
కథ స్టార్ట్ అయినా పది నిమిషంలోనే మనకు ఆది అర్ధమవుతుంది. ఊరులో ఉండే జనం ఎంత ప్రేమగా ఉంటారో అంతే కఠినంగా ఉంటారు అనే విషయాన్ని బాగా చూపించారు. ఈ కథ నాన్ లినియర్ స్క్రీన్ ప్లేతో మొదలు అవుతుంది. దాని వాళ్ల నెక్ట్స్ ఎం జరుగుతుంది అని క్యూరియాసిటీ చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు కలుగుతుంది.
మంచి సస్పెన్స్‌తో ఇంటర్వెల్
నీలకంఠ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాల బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీ, తన లవ్, మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్, నీలకంఠ చేసిన తప్పుతో సాగుతుంది. ఇంటర్వెల్‌ను మంచి సస్పెన్స్‌తో ఎండ్ చేశారు.
సెకండ్ హాఫ్ అంతా చాలా రేసీ స్క్రీన్‌ప్లేతో పరుగెడుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌ని చాలా కొత్తగా డిజైన్ చేసారు. ఊరులో జరిగే కబడ్డీ స్పోర్ట్స్‌ని బాగా చిత్రీకరిచారు. చివరి 30 నిముషాలు స్టోరీ పే అఫ్‌లు ఇచ్చిన విధానం చాల బాగా ఉంది. కథకు మెయిన్ ఇంటెన్షన్‌ని లాస్ట్‌లో కొత్తగా చూపించారు. క్లైమాక్స్ బాగుంది.
నటీనటుల యాక్టింగ్
మెయిన్ లీడ్‌గా చేసిన మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్‌గా పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. తన క్యారెక్టర్‌తో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్‌లో చాలా ఎఫర్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆకట్టుకున్నాడు.
యష్న ముత్తులూరి సీత పాత్రలో చాలా సహజంగా నటించింది. స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్‌తో చేసింది. ఆమెకు ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందో చూడాలి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ రాంకీ చాలా రోజులకు తెలుగులో కనిపించారు. ఆయన యాక్టింగ్ డీసెంట్‌గా ఉంది. ప్రతి ఒక్కరు చాల సహజంగా నటించి మెప్పించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
డైరెక్టర్ రాకేష్ మాధవన్ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను బాగా చూపించారు. ఆ విషయంలో సక్సెస్ సాధించారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. విజువల్స్, ఎడిటింగ్ బాగుంది. ఎడిటింగ్ విధానం ఆకట్టుకుంటుంది. సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే డిఫరెంట్ పాయింట్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్ గల రూరల్ యాక్షన్ థ్రిల్లర్ నీలకంఠ.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


