హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్- హీరోయిన్ స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్- అదిరే యాక్షన్‌తో నీలకంఠ టీజర్ రిలీజ్!

చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన లేటెస్ట్ సినిమా నీలకంఠ. విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నీలకంఠ సినిమాలో బ్యూటిపుల్ స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్ చేసింది. ఇటీవల (డిసెంబర్ 17) నీలకంఠ టీజర్ రిలీజ్ చేశారు. మరి ఆ వివరాల్లోకి వెళితే..!

Dec 18, 2025, 16:10:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'మాస్టర్ మహేంద్రన్'.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు.

హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్- హీరోయిన్ స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్- అదిరే యాక్షన్‌తో నీలకంఠ టీజర్ రిలీజ్!
హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్- హీరోయిన్ స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్- అదిరే యాక్షన్‌తో నీలకంఠ టీజర్ రిలీజ్!

నేను చూసాను తాతయ్య

అయితే పెద్ద రాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు మాస్టర్ మహేంద్రన్. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్ గారికి విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడిగా మహేంద్ర అందరికి గుర్తిండిపోతాడు.

విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా

అలా ఆకట్టుకున్న ఆ పిల్లాడు కాస్తా ఇప్పుడు హీరో అయ్యాడు. మహేంద్రన్ హీరోగా నటించిన కొత్త సినిమా 'నీలకంఠ'. విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కన నీలకంఠ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.

స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్

నీలకంఠ సినిమాలో యష్నా చౌదరి, నేహా పఠాన్ ఇద్దరు హీరోయిన్స్‌గా నటించారు. బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ స్పెషల్ రోల్ పోషించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది.

నీలకంఠ టీజర్ రిలీజ్

నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. తాజాగా నీలకంఠ టీజర్‌ను డిసెంబర్ 17న మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది. డీఓపీ, మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచాయి.

అన్ని అంశాలతో నీలకంఠ టీజర్

నీలకంఠ చిత్రంకు స్టార్ సర్కిల్ సంస్థ డిజిటల్ మార్కెటింగ్ చేస్తుండగా.. కిలారి సుబ్బారావు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నీలకంఠ టీజర్ విషయానికొస్తే.. ఓ గ్రామం, అందులో ఊరి పెద్ద, హీరో హీరోయిన్ ప్రేమాయణం, పెద్దలు ఒప్పుకోవడం వంటి అంశాలతో సాగినట్లుగా తెలుస్తోంది.

మాసీ యాక్షన్

"జాతరకు వచ్చి దేవుడిని చూడకుండా చావును చూస్తానంటారేంట్రా" అని హీరో చెప్పే డైలాగ్ మాసీగా ఉంది. అలాగే, సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అందులో మంచి ఈజ్‌తో మహేంద్రన్ నటించాడు. అలాగే, "బతుకు మీద ఆశ కల్పించే వాడు నాయకుడు అంతేకానీ ఇలా భయపెట్టేవాడు కాదు" అని ఊరి పెద్ద చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

అదిరిపోయే డైలాగ్స్

"భుజాలపై తప్పు చేశాడన్న నింద ఉన్నప్పుడు చేతిలో ఎన్ని కప్పులున్న ఆనందాన్ని ఇవ్వవు", "తప్పు చేసినోడు కాలర్ పట్టుకోవడం మానేసి కాళ్లు పట్టుకునే పిచ్చిజనం" అని వచ్చే డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్స్ చూపిస్తున్నాయి. వీటికి తోడు బీజీఎమ్ అదిరిపోయింది. ఆ డైలాగ్స్‌కు నెక్ట్స్ హైప్ ఇచ్చాయి. ఇలా నీలకంఠ టీజర్ అట్రాక్ట్ చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More