ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్ సీజన్ 2- బోల్డ్‌గా ముగ్గురు హీరోయిన్ల ఫన్- టీజర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలుగులోకి సూపర్ హిట్ తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. మరోసారి ముగ్గురు హీరోయిన్లు బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా చేసే ఫన్ రైడ్‌తో ఈ సీజన్ 2 ఉన్నట్లు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది. త్రీ రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసుకుందాం.

Published on: Nov 22, 2025, 13:24:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే 3 రోజెస్ సీజన్ 2లోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు. తాజాగా త్రీ రోజెస్ సీజన్ 2 టీజర్‌ను (నవంబర్ 21) విడుదల చేశారు. ఈ టీజర్‌లో త్రీ రోజెస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్ సీజన్ 2- బోల్డ్‌గా ముగ్గురు హీరోయిన్ల ఫన్- టీజర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్ సీజన్ 2- బోల్డ్‌గా ముగ్గురు హీరోయిన్ల ఫన్- టీజర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బోల్డ్ రొమాంటిక్ సిరీస్

అయితే, 2021లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ సిరీస్ 3 రోజెస్. గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రొమాంటిక్, కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో 3 రోజెస్ సీజన్ 1 అలరించింది.

ఇప్పుడు నాలుగేళ్లకు ఈ సూపర్ హిట్ బోల్డ్ కామెడీ సిరీస్‌ 3 రోజెస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది. ఈపాటికే త్రీ రోజేస్ సీజన్ 2లో నటించి హీరోయిన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు. అయితే, రెండో సీజన్‌లో ఇద్దరు హీరోయిన్స్ మారిపోయారు. మొదటి సీజన్‌లో ఉన్న ఈషా రెబ్బా రెండో సీజన్‌లోనూ కంటిన్యూ అవుతోంది.

వారికి బదులుగా

కానీ, పాయల్, పూర్ణకు బదులు త్రీ రోజెస్ సీజన్ 2లో గ్లామర్ బ్యూటీ రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు చేస్తున్నారు. ఇందులో కుషిత కల్లపు పాత్ర బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక నిన్న (నవంబర్ 21) త్రీ రోజెస్ సీజన్ 2 టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆద్యంతం రొమాన్స్, గ్లామర్ ట్రీట్, కామెడీతో 3 రోజెస్ సీజన్ 2 టీజర్ సాగింది. ముగ్గురు హీరోయిన్లు బోల్డ్‌గా చేసిన ఫన్‌తో టీజర్ అలరించింది. "ఇంకేటీ ముంబైలో సోలో లైఫా" అని ఈషా రెబ్బాను అడిగితే.. "లేదు ఇక్కడ కూడా 3 రోజెస్" అనే ఆన్సర్‌తో మిగిలిన ఇద్దరు హీరోయిన్లను చూపించారు.

రివేంజ్ తీర్చుకునేందుకు

"3 రోజెస్ విత్ ఏ బ్యాంగ్" అనే క్యాప్షన్‌తో సీజన్ 2ను చూపించారు. ఇక టీజర్‌లో ఈషా రెబ్బాపై హర్ష చెముడు రివేంజ్ తీర్చుకునేందుకు సరికొత్తగా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, కమెడియన్ సత్య ముందు రాశి సింగ్‌ను ఇష్టపడి చివరిలో విలన్‌గా మారడాన్ని చూపించారు.

వీటికి మించి బజ్జీల పాపగా పాపులర్ అయిన కుషిత కుల్లపు పబ్‌లో చీజ్ బజ్జీలు కావాలని తనపై తానే సెటైర్ వేసుకోవడం హైలెట్‌గా నిలిచింది. కాగా, త్రీ రోజెస్ సీజన్ 2కి షో రన్నర్‌గా ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ఉన్నారు. ఈ సీజన్‌కు కిరణ్ కుమార్ దర్శకత్వం వహించారు.

3 రోజెస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇకపోతే ఆహాలో త్రీ రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 12న ఆహా ఓటీటీలో 3 రోజెస్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More