నేను సెట్‌లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ ఓల్డ్ గెటప్‌లో వచ్చి కలిశారు, అలా ఇండస్ట్రీ బాగుంటుంది.. బ్రహ్మానందం కామెంట్స్
తెలుగు లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. అయితే గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
టాలీవుడ్ హీరో నరేష్ అగస్త్య, బ్యూటిపుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ సినిమాలో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.

డార్క్ కామెడీ కథతో
డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారని టాక్. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 17న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. "గుర్రం పాపిరెడ్డి సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు" అని అన్నారు.
నాతో సీన్స్ లేవు కానీ
"యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు. కానీ, యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వశీధర్ కోసిగి తమ పాత్రల్లో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్‌ఫార్మ్ చేయించారు" అని బ్రహ్మానందం తెలిపారు.
"నేను సెట్‌లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్‌లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. ఇలా డిఫరెంట్ గెటప్స్‌లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు". అని బ్రహ్మానందం ప్రశసించారు.
అలా ఇండస్ట్రీ బాగుంటుంది
"ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది" అని బ్రహ్మానందం అభిప్రాయం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నేను స్టార్ట్ చేయడానికి మొదటి కారణం నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ బాబీ. అతని వల్లే నేనీ మూవీ మొదలుపెట్టాను. ఎవరికైనా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే వర్క్ బాగా చేయగలుగుతారు. ఈ సినిమాకు నాకు ప్రొడ్యూసర్స్ కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన సపోర్ట్ గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్‌గా ఉంది" అని అన్నారు.
కొత్త తరహా సినిమాను
"తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం ఎఫర్ట్స్ పెట్టాం. కొత్త తరహా సినిమా అని ఎక్కడా మన నేటివిటీ దాటి వెళ్లలేదు. మా మూవీ టీమ్ లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ దర్శకుడిగా నా ప్రయత్నానికి సపోర్ట్ గా నిలిచారు. వారందరికీ థ్యాంక్స్. డిసెంబర్ 19న రిలీజ్ కానున్న గుర్రం పాపిరెడ్డి మూవీని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి" అని దర్శకుడు మురళీ మనోహర్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


