డిఫరెంట్ డార్క్ కామెడీ, నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రఫీ చేశాను.. జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కామెంట్స్
జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి ఫరియా అబ్దుల్లా. తాజాగా ఫరియా అబ్దుల్లా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీలో నరేష్ అగస్త్య హీరోగా చేశాడు. డార్క్ కామెడీతో వస్తోన్న గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు యువతను తెగ అట్రాక్ట్ చేసింది. ఫరియా అబ్దుల్లా తాజాగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య హీరోగా చేశాడు.

డిసెంబర్ 19న గుర్రం పాపిరెడ్డి రిలీజ్
డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) గుర్రం పాపిరెడ్డి సినిమాను నిర్మించారు. ఈ మూవీకి డైరెక్టర్ మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. గుర్రం పాపిరెడ్డి డిసెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఫరియా అబ్దుల్లా కామెంట్స్
ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ 17న గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది.
డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్‌లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. ఈ ఈవెంట్‌లో మా డైరెక్టర్ మురళీ మనోహర్ గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాంటి క్రియేటివ్ పర్సన్ భావోద్వానికి గురయ్యారంటే మూవీ కోసం ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు" అని తెలిపింది.
ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్‌లా
"కృష్ణ సౌరభ్ పాటలతోనే కాదు తన బీజీఎంతో కూడా మూవీని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్ ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. వాళ్లతో టూర్ చేసినట్లు షూటింగ్ కంప్లీట్ చేశాం. ఎక్కడా మాకు స్ట్రెస్ ఇవ్వలేదు. మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం" అని ఫరియా అబ్దుల్లా చెప్పింది.
కొత్త జోనర్స్‌లో
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. "ఈ సినిమాకు వర్క్ చేయడం ప్రతి రోజూ ఎగ్జైటింగ్ ఫీల్ కలిగించింది. కొత్త జోనర్స్‌లో సాంగ్స్‌ను కంపోజ్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ పైసా డుమ్ డుమ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫరియా గారు సింగర్‌గా ఆకట్టుకుంటారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్" అని అన్నారు.
గుర్రం పాపిరెడ్డి నటీనటులు
ఇదిలా ఉంటే, గుర్రం పాపిరెడ్డి సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లాతోపాటు బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


