ఆ సింగర్‌ను హత్య చేశారు.. అతనిది సహజ మరణం కాదు: అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
రెండు నెలల కిందట ప్రమాదవశాత్తూ చనిపోయిన బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్‌ది హత్యే అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం సంచలనం రేపుతోంది. అతని హత్యపై మంగళవారం (నవంబర్ 25) అక్కడి అసెంబ్లీలో చర్చ జరిగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశంలో సంచలన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ దివంగత సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసుపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానాన్ని తాము వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గార్గ్‌ది సహజం మరణం కాదు.. హత్యే అని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హత్య కేసుగానే నమోదు
బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ రెండు నెలల కిందట మరణించిన విషయం తెలుసు కదా. దీనిపై అస్సాం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వివరాలు వెల్లడించారు. "జుబిన్ గార్గ్ సెప్టెంబర్ 19, 2025న మరణించారు. మరుసటి రోజు సెప్టెంబర్ 20న, మేము మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. జుబిన్ గార్గ్‌ది సహజ మరణం కాదని మొదటి రోజు నుంచే అనుమానించాం"
"ప్రారంభ దర్యాప్తు సమయంలో ఇది సహజ మరణం కాదని, ఓ హత్య అని అస్సాం పోలీసులు నిర్ధారించారు. ఘటన జరిగిన రెండు రోజుల్లోనే అస్సాం ప్రభుత్వం ఈ సంఘటనను హత్యగా పేర్కొంటూ, బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత)లోని సెక్షన్లు 61, 105, 106తో పాటు సెక్షన్ 103ని కూడా జత చేయాలని కోర్టును అభ్యర్థించింది"
"కోర్టు మా అభ్యర్థనను అంగీకరించి సెక్షన్ 103ని జోడించడానికి అనుమతించింది. మూడవ రోజు నుంచే ఇది హత్య కేసుగా మారింది. మేము సెక్షన్ 103ను జత చేయకపోతే, నిందితులందరికీ బెయిల్ లభించి ఉండేది" అని సీఎం శర్మ స్పష్టం చేశారు.
దర్యాప్తు వివరాలు, అరెస్టులు
జుబీన్ గార్గ్ మృతి కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు, 252 మంది నుండి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సీఎం శర్మ తెలిపారు. "శ్యామకాను మహంత, సిద్ధార్థ శర్మ (జుబిన్ మేనేజర్), శేఖర్ జ్యోతి గోస్వామి (బ్యాండ్‌మేట్), అమృతప్రభ మహంత (సహ గాయని) హత్య కేసు కారణంగా ప్రస్తుతం జైలులో ఉన్నారు" అని వెల్లడించారు.
జుబిన్ గార్గ్ కేసులో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. సింగపూర్ అధికారులు అస్సాం పోలీసులను సింగపూర్ సందర్శించడానికి అనుమతించారు. సింగపూర్ అధికారులు అవసరమైన పత్రాలను నవంబర్ 4న అస్సాం ప్రభుత్వానికి పంపారు. పోస్టుమార్టం నివేదికను సింగపూర్ నుండి అందుకున్న అస్సాం పోలీసులు, దానిని గౌహతి మెడికల్ కాలేజీకి పంపి, రెండు నివేదికలను పరిశీలించగా, నవంబర్ 5న తుది నివేదిక అందింది.
జుబిన్ గార్గ్ నేపథ్యం ఇదీ
జుబిన్ గార్గ్ నవంబర్ 18, 1972న మేఘాలయలోని తురాలో జన్మించారు. అస్సామీ కుటుంబానికి చెందిన ఆయన జోర్హాట్‌లోని తములిచిగాలో ఉన్న తన పూర్వీకుల గ్రామానికి బలంగా అనుబంధం కలిగి ఉండేవారు. జుబీన్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా జుబీన్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అతడు సెప్టెంబర్ 19న సింగపూర్ లో సముద్రంలో లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొడుతూ చనిపోయాడు. అతని వయసు 52 ఏళ్లు. అతనికి సెప్టెంబర్ 23న అస్సాంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


