ధర్మేంద్ర.. మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటూ అంతర్జాతీయ మీడియా ప్రశంసించిన వేళ.. హాలీవుడ్ నటులతో పోలిక

ధర్మేంద్ర మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటూ ఇంటర్నేషనల్ మీడియా కూడా పొగిడిందన్న విషయం తెలుసా? 1970ల్లో అతని స్టార్‌డమ్ అలాంటిది మరి. సోమవారం (నవంబర్ 24) కన్నుమూసిన ఈ నటుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవీ.

Published on: Nov 24, 2025, 15:20:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఐకాన్ ధర్మేంద్రను అతని భారీ శరీరాకృతి, యాక్షన్ మ్యాన్ క్యారెక్టర్ కారణంగా ‘హీ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. అయితే అతని సినీ ప్రయాణం మాత్రం ఒక రొమాంటిక్ స్టార్‌గా మొదలైంది. నిజానికి 1960ల చివర్లో, 1970ల ప్రారంభంలో అతడు ఇండస్ట్రీలోనే అత్యంత అందమైన నటులలో ఒకరిగా నిలిచాడు. అంతర్జాతీయ మీడియా కూడా అతన్ని 'ప్రపంచంలోనే అత్యంత అందమైన పురుషులలో' ఒకరిగా పేర్కొన్నదన్న నిజం మీకు తెలుసా?

ధర్మేంద్ర.. మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటూ అంతర్జాతీయ మీడియా ప్రశంసించిన వేళ.. హాలీవుడ్ నటులతో పోలిక
ధర్మేంద్ర.. మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటూ అంతర్జాతీయ మీడియా ప్రశంసించిన వేళ.. హాలీవుడ్ నటులతో పోలిక

మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ధర్మేంద్ర

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటుల్లో ధర్మేంద్ర ఒకడు. కెరీర్లో 75 హిట్స్ అందుకున్న ఏకైక బాలీవుడ్ నటుడు. అయితే 1970లలో ధర్మేంద్ర ప్రముఖ నటుడిగా స్థిరపడినప్పుడు అతని గురించి దేశీయంగానే కాదు విదేశాలలో కూడా అనేక సినీ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. 1970లలో అంతర్జాతీయ పబ్లికేషన్‌లు ప్రపంచంలో అత్యంత అందమైన పురుషులలో అతన్ని టాప్ 10, టాప్ 5 జాబితాలలో చేర్చాయి. కొన్ని పత్రికలు అయితే ఏకంగా మొదటి స్థానంలో ఉంచాయి.

ఆ సమయంలో హాలీవుడ్ స్టార్లు అయిన జేమ్స్ డీన్, పాల్ న్యూమాన్‌లతో తనను పోల్చడాన్ని ధర్మేంద్ర గుర్తు చేసుకున్నాడు. రెహ్రన్ రెట్రోకి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో అతడు దీని గురించి వెల్లడించాడు. "కొంతమంది నన్ను ఒక హాలీవుడ్ స్టార్‌తో పోల్చారు. కానీ నేను ఆయన సినిమానే చూడలేదు. అప్పుడు వెళ్లి ఆయన సినిమా చూశాను. ఆ తర్వాత పక్క నుంచి చూస్తే నేను కొంచెం ఆయనలాగే కనిపిస్తానని అనుకున్నాను. నాకు కూడా అలాగే అనిపించడం మొదలైంది" అని ధర్మేంద్ర చెప్పడం విశేషం.

ధర్మేంద్ర మరణం

బాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 24) ఉదయం 89 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. అతడు గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల మొదట్లో ఆసుపత్రిలో చేరిన తర్వాత, నవంబర్ 10న అతడు చనిపోయినట్లు కొన్ని నివేదికలు వచ్చినా, కుటుంబం ఆ వార్తలను ఖండించింది.

ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి కొద్ది రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోనే చికిత్స పొందుతూ నవంబర్ 24న ముంబైలోని జుహూలో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. అంతేకాదు అతని అంత్యక్రియలు కూడా వెంటనే పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More