మదం రివ్యూ- లైంగిక కోరికలు, రివేంజ్- పచ్చిగా, బోల్డ్‌గా బిగ్ బాస్ ఇనయా సుల్తానా- రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

బిగ్ బాస్ ఇనయా సుల్తానా నటించిన బోల్డ్, రొమాంటిక్, రా అండ్ రస్టిక్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మదం. లైంగిక వాంఛలు, ప్రతికారం చుట్టూ సాగే మదం సినిమా కొత్త ఏడాది కానుకగా జనవరి 1న థియేటర్లలో విడుదలైంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి మదం రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jan 2, 2026, 19:02:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: మదం

మదం రివ్యూ- లైంగిక కోరికలు, రివేంజ్- పచ్చిగా, బోల్డ్‌గా బిగ్ బాస్ ఇనయా సుల్తానా- రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
మదం రివ్యూ- లైంగిక కోరికలు, రివేంజ్- పచ్చిగా, బోల్డ్‌గా బిగ్ బాస్ ఇనయా సుల్తానా- రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

నటీనటులు: ఇనయా సుల్తానా, హర్ష గంగవరపు, అనురూప్, లతా రెడ్డి, అనురూప్ కొటారి, హేమ పాప్, మిర్యాల రవి, జంగం వెంకటేష్ తదితరులు

కథ: రమేష్ బాబు కోయ, వంశీకృష్ణ మల్లా

దర్శకత్వం: వంశీకృష్ణ మల్లా

సంగీతం: దేవ్‌జాండ్

సినిమాటోగ్రఫీ: రవి వల్లెపు

నిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ

విడుదల తేది: 1 జనవరి 2026

చాలా కాలం తర్వాత బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా నటించిన సినిమా మదం. రా అండ్ రస్టిక్‌గా లైంగిక కోరికలు, ప్రతికారం, యాక్షన్, డ్రామా అంశాల చుట్టూ సాగే కథగా మదంను రూపొందించారు. బోల్డ్ రొమాంటిక్ రా అండ్ రస్టిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.

ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన మదం ట్రైలర్ పచ్చిగా, బోల్డ్‌గా టాక్ తెచ్చుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్లలో మదం విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మదం రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

1980వ దశకంలో ఒక నిరుపేద కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. ఒక అవినీతి పోలీస్ అధికారి, అతని భార్య తమ స్వార్థం కోసం ఆ పేద కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేశారనేది ఈ సినిమా కథాంశం. ఈ క్రమంలో మధ్యలోకి ఇనయా సుల్తానా (బిగ్ బాస్ ఫేమ్) పాత్ర ప్రవేశిస్తుంది.

ఆమె తన లైంగిక వాంఛలతో, వింత ప్రవర్తన వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా విధ్వంసకర సంఘటనలు జరుగుతాయి. ముగ్గురు వ్యక్తులతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటీ? దానివల్ల పేద కుటుంబం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది?, న్యాయ పోరాటం చేసిన హీరోకు ఏమైంది? పోలీస్ ఆఫీసర్ కథ ఏంటీ? హీరోకు న్యాయం దక్కిందా? లేదా? తెలియాలంటే మదం చూడాల్సిందే.

విశ్లేషణ:

మదం సినిమా టైటిల్‌కి తగినట్లే పాత్రల తీరు ఉంటుంది. లైంగిక వాంఛల గురించి మాత్రమే కాకుండా అంతకంటే లోతుగా పాత్రల్లోని మానసికకతను చెప్పేలా ఉంటాయి. ఇందులో బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ అవి కేవలం ప్రేక్షకుల కోసం పెట్టినట్లు అనిపించవు. ఎంచుకున్న కథకు అనుగుణంగా సాగుతాయి.

ఒక మహిళ తన శరీరాన్ని, కోపాన్ని ఆయుధాలుగా మలుచుకుని ఇతరులను ఎలా భయపెడుతుందో ఇందులో చూడొచ్చు. ఆ యూనిక్ పాయింట్‌తో మదంను తెరకెక్కించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా జడ్జ్ చేయలేనంతగా గొప్పగా మలిచారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

ఆ ముగింపు ప్రేక్షకులను ఒక్క క్షణం షాక్‌కు గురి చేస్తుంది. మిగతా సీన్స్, ప్రొసిడింగ్స్ అన్ని పచ్చిగా, బోల్డ్‌గా సాగుతాయి. రా అండ్ రస్టిక్‌గా సీన్స్, పాత్రల తీరు, డైలాగ్స్ ఉంటాయి. చాలా మందితో అఫైర్స్, అందుకు కారణాలు, వాటి ప్రభావం వంటి విషయాలు బాగానే చూపించారు.

నటీనటుల పనితీరు

మదం సినిమా అంతా ఇనయా సుల్తానా చుట్టూ సాగుతుంది. అంతేకాకుండా ఇనయా సైతం తన భుజస్కంధాలపైన సినిమాను నడిపించింది. ముఖ్యంగా బోల్డ్, అగ్రెసివ్ మహిళగా ఇనయా సుల్తానా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె తన పాత్రలో ఉన్న గందరగోళం, భయం కలిగించే తీరు తెలుగు తెరపై అద్భుతంగా ఉంది.

హర్ష, అనురూప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. లత రెడ్డి, హేమ పాప్ ఇతర నటీనటులు కథకు బలాన్ని చేకూర్చేలా మెప్పించారు. ఇక సాంకేతికపరంగా చూస్తే.. డైరెక్టర్ వంశీ కృష్ణ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ప్రతి సీన్ రియల్ లైఫ్‌లో కనిపించినట్లుగా అనిపిస్తుంది. రవికుమార్ ఫోటోగ్రఫీ 80ల నాటి వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించింది.

టెక్నికల్ అంశాలు

స్టూడియో సెట్టింగులు కాకుండా నిజమైన లొకేషన్లలో షూట్ చేయడం సినిమాకు చాలా రస్టిక్, రియలిస్టిక్ ఫ్లేవర్ ఫీల్ కలిగింది. అది సినిమాకు ప్లస్ అయింది. ‘ఈగల్’ ఫేమ్ దేవ్‌జాండ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆ బీజీఎమ్ సన్నివేశాల ఎఫెక్ట్స్‌ను మరింత పెంచింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

మదం ఒక పచ్చి నిజం లాంటి సినిమా. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, హార్డ్ హిట్టింగ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది తప్పక నచ్చుతుంది. అద్భుతమైన రియలిస్టిక్ నటన, గుండె బరువెక్కిపోయే క్లైమాక్స్‌తో సాగే మదం మూవీపై ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా లుక్కేయడం బెటర్.

రేటింగ్: 2.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More