Sign in

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నను లాగిపెట్టి కొట్టిన పారు- ఒక్క చోట శ్రీధర్ ఫ్యామిలీ- రివేంజ్ కోసం వైరా

కార్తీక దీపం 2 టుడే జనవరి 1 ఎపిసోడ్ లో జ్యోత్స్నను కొడుతుంది పారిజాతం. నా తమ్ముడిని బయటకు తీసుకొస్తానని జ్యో చెప్తుంది. మరోవైపు శ్రీధర్, కావేరి, స్వప్న కలిసి కార్తీక్ ఇంటికి వస్తారు. స్వప్న బాధ పడుతుంది. రివేంజ్ కోసం వైరా వెయిట్ చేస్తుంటాడు.

Published on: Jan 1, 2026, 07:09:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే జనవరి 1 ఎపిసోడ్ లో జ్యోత్స్నను చెంపదెబ్బ కొడుతుంది పారు. నువ్వు చేసిన పాపల పుట్ట ఎక్కడ భయపడుతుందనే భయం. మీ తమ్ముడిని అడ్డుపెట్టుకుని వైరాను మోసం చేశాడు ఓకే. కానీ నేరం నెత్తిమీద పెట్టుకుని నా మనవడు కూడా స్టేషన్లో ఉన్నాడు. నా మనవడికి కూడా శిక్ష పడుతుంది కదా అని పారు సీరియస్ అవుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దెబ్బతిన్న పులి

నా తమ్ముడిని కాపాడుకోనా అని జ్యోత్స్న అంటుంది. మరి అందరి ముందు ఎందుకు ఒప్పుకోలేదని పారిజాతం అంటే, అలా చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవారని జ్యో చెప్తుంది. దరిద్రం వదిలిపోయేది. కార్తీక్ గాడు వాళ్ల నాన్నను నిర్దోషిగా విడిపించుకున్నాడు. కానీ నువ్వు సొంత తమ్ముడిని మోసం చేశావు. జీవితమే లేకుండా చేశావని పారు అంటుంది. నా తమ్ముడు దెబ్బతిన్న పులి. ఎవరు ఎలాంటి వాళ్లో వాడికి బాగా తెలిసిందని జ్యో అంటుంది.

కాశీని తీసుకొస్తా

కాశీ, నేను ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలం. ఈ విషయం కాశీకి తెలుసా? బావ చెల్లిలి భర్తనే కాశీ. మరి కాశీని ఎందుకు కాపాడుకోలేదని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. తండ్రి కోసమనే పారు అనగానే, ఇది స్వార్థమంటే. తన తండ్రికి ప్రమాదం వచ్చిందనగానే చెల్లెలి భర్త కూడా పరాయివాడు అయిపోయాడు. మామయ్యను సీఈఓ పోస్టు నుంచి తిప్పడానికి వైరాను ట్రాప్ చేశాను. కాశీ జీవితాన్ని మార్చడానికి ఉద్యోగం ఇప్పించా. కాశీని బావే ఇరికించాడు. కాశీకి బెయిల్ కోసం ట్రై చేస్తే వైరా చెప్పిందే నిజమవుతుంది. కాస్త టైమ్ ఇవ్వు కాశీని బయటకు తీసుకొస్తానని జ్యోత్స్న చెప్తుంది.

తండ్రిని భర్తలా

మీ ఆయన కూడా రావాలని అమ్మకు చెప్పు పెద్దమ్మ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మేం అడిగింది కూడా చేయాలి కదా అని కార్తీక్ అంటాడు. ఏం కావాలో అడుగు అక్క అని కాంచన అంటుంది. భోజనానికి ఇంటికి కుటుంబ సమేతంగా పిలవమన్నావు. మా నాన్న కాకూడదు అమ్మా. పిల్లల కోసం మీ నాన్న పారును పెళ్లి చేసుకున్నాడు. నా కోసం నా తండ్రిని భర్తలా చూడలేవా అమ్మ? ఆయనకు నువ్వు వేసింది ఉరిశిక్షలా ఉంది. నా తండ్రిని భర్తలా చూడాల్సిందేనని కార్తీక్ అంటుంటే కావేరి, స్వప్న, శ్రీధర్ వస్తారు.

స్వప్న బాధ

నేను అందరిని బాధపెట్టా. కాశీతో నా పెళ్లి గురించి. తప్పుడు నిర్ణయాలు ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తాయి. నేను తొందరపడ్డా. నేను రాంగ్ పర్సన్ ను లైఫ్ పార్ట్ నర్ గా సెలక్ట్ చేసుకున్నా. తండ్రిని బాధపెడుతూనే ఉన్నా. నా భర్త ఏకంగా మామగారినే పోలీస్ స్టేషన్ కు పంపాడని స్వప్న ఫీల్ అవుతుంది. ఎవరి చేతలకు వాళ్లే బాధ్యులు. కాశీ మనతో చెప్పాల్సింది. సొంతవాళ్లను మోసం చేయడం తెలివితేటలు అనుకున్నాడని కార్తీక్ అంటాడు.

రివేంజ్ కోసం వైరా

నీ శత్రువును నమ్మొద్దని చెప్పా. ఏం చేయాలో నాకు తెలియదా అన్నావ్ అని వైరాకు అసిస్టెంట్ చెప్తాడు. బెయిల్ రాలేదని నేనుంటే ఏంట్రా అని చిరాకు పడతాడు వైరా. నువ్వు తప్పు చేశావు కాబట్టే రైట్ ప్లేస్ లో ఉన్నావు. ఏ తప్పు చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నా. టైమ్ దాటిపోయాక రియలైజ్ అయ్యానని కాశీ అంటాడు. మీ మామకు శిక్ష పడి ఉంటే సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకునేవాడివి. సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తానని వైరా చెప్తాడు.

దశరథ సేవ

సుమిత్ర పాదాలకు ఆయింట్ మెంట్ రాస్తుంటాడు దశరథ. నిద్రలో నుంచి లేచి ఏంటీ ఇది? ఇప్పుడు ఇదంతా ఎందుకు? అని అడుగుతుంది సుమిత్ర. మందు రాస్తేనే తగ్గుతుంది. మనిషి కోరి తెచ్చుకునే బంధాల్లో చివరి వరకు ఉండేది వివాహ బంధం. ఒక వయసొచ్చాక దూరంగానే పడుకున్నా ఒకే గదిలో ఉంటారు భార్యాభర్తలు. బంధానికి ఇద్దరు కానీ బతకడానికి ఒక్కరే. నువ్వు హాయిగా పడుకో అని కాళ్లు పడతాడు దశరథ.

అప్పుడే డాక్టర్ నుంచి దశరథకు కాల్ వస్తుంది. ఓ స్పెషలిస్ట్ డాక్టర్ రేపు వచ్చి మీతో మాట్లాడతారని డాక్టర్ చెప్తాడు. ఫోన్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారంటే సుమిత్రకు ఏమైందని కంగారు పడతాడు దశరథ. మరోవైపు కార్తీక్ ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటారు. కాంచన మాటలను తలుచుకుని శ్రీధర్, కాంచన తినకుండా ఉండిపోతారు.

శ్రీధర్ దే తప్పు

మన ఫ్యామిలీ అంతా ఇలా కలిసి భోంచేయడం ఫస్ట్ టైమ్ కదా అని కార్తీక్ అంటే, ఇలాగే ఉండాలని శ్రీధర్ అంటాడు. మరి కొడుకు, కోడలు వద్దా? అన్నింటికి మీరే కారణం. కాశీ తప్పు చేయడానికి కారణం మీరు కాదా? జాబ్ మళ్లీ వస్తుంది. లేదా నచ్చింది చేసుకుంటాడు. కానీ పీఏగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కాశీ తప్పు చేశాడు. అల్లుడు తనకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం తప్పు అని కాంచన అంటుంది.

మార్పు ఒకేసారి రాదు. ఏదో ఒక రోజు అందరం కలిసే ఉంటామని దీపతో అంటాడు కార్తీక్. మనిషి చెట్టులా బతకాలి. ఎదుగుతూ ఉండాలి. ఆనందాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More