కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:అసమర్థుడివి, చేతకానితం-కాశీపై స్వప్ప మాటల దాడి-దీపపై కాంచన నిందలు-మధ్యలో ఇరుక్కున్న కార్తీక్

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో కావేరి వచ్చి కార్తీక్, దీపతో పాటు కాంచనను తన ఇంటికి రమ్మని అడగాలని చూస్తుంది. కానీ కాంచన ఆ మాట పూర్తి కానివ్వదు. కాశీని చేతకానివాడంటూ స్వప్న సీరియస్ అవుతుంది. అమ్మను చిన్నమ్మ ఇంటికి తీసుకెళ్లాలని కార్తీక్ అనుకుంటాడు. కానీ దీపపై కాంచన నిందలు వేస్తుంది. 

Published on: Dec 12, 2025 7:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో శౌర్యకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని కాంచన, అనసూయ అడుగుతారు. శౌర్య కౌంటర్లు కామెడీగా ఉంటాయి. నువ్వు కలెక్టర్ అవాలని మీ అమ్మ కోరుకుంటుందని శౌర్యతో కాంచన అంటుంది. అయిపోతాను నానమ్మ, ఈ రోజు అయిపోమంటావా? అని శౌర్య అంటుంది. చదువు పేరుతో శౌర్య డ్రాయింగ్ చేస్తుంటే చూసి అనసూయ పట్టుకోవాలని చూస్తుంది, కానీ దొరకదు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కావేరి ఇంటికి

కాంచన ఇంటికి వచ్చిన కావేరి.. శౌర్యను పట్టుకుంటుంది. ఈ టైమ్ లో వచ్చావేంటీ? అని కాంచన అడుగుతుంది. ఈ ఇంట్లో పని ఉండి వచ్చా. అమ్మ కడుపులో బేబీని చూద్దామని వచ్చానని కావేరి చెప్తుంది. కడుపుతో ఉన్న కోడలికి అత్త వరసయ్యే వాళ్లు వండిపెట్టడం ఆనవాయితీ. కార్తీక్, దీపను రేప్పొద్దున టిఫిన్ కు తీసుకెళ్దామని అడిగేందుకు వచ్చా. వాళ్లతో పాటు అని కావేరి అంటుండగానే, ఇద్దరు వస్తారని మాట కట్ చేస్తుంది కాంచన.

కాశీపై స్వప్న ఫైర్

కాశీ ఇంటికి లేట్ వస్తాడు. కాల్ చేస్తే మధ్యలో కట్ చేస్తే బాస్ ఏమనుకోవాలి? అని ఫైర్ అవుతాడు శ్రీధర్. ఫుడ్ ట్రక్ దగ్గర నిలబడి బిజినెస్ గురించి తెలుస్తుందని శ్రీధర్ అంటాడు. శ్రీధర్, స్వప్న అరుచుకుంటారు. పీఏగా చేయడం ఈయన గారికి నామూశీగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దగ్గర అబద్ధం చెప్పడానికి వెనకాడని మనిషి మీ దగ్గర మాట మార్చడానికి ఎందుకు ఆలోచిస్తాడు? మామయ్య మీ కోసం ఏం చేశారు? ఇలా ఉన్నావంటే కారణం మా నాన్న, మా అన్నయ్య అని స్వప్న అంటుంది.

చేతకానితనం

నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు. నాన్న, అన్నయ లేకపోతే నువ్వు ఎందుకు పనికి రావు. ఒక రెండు నెలల ఇల్లు మెయింటేన్ చేయ్. నువ్వు అసమర్థుడివే. నాకు ఇప్పుడు రూ.లక్ష అవసరం. ఇవ్వగలవా? నీ అసమర్థతకు నేను పెట్టే పేరు చేతకానితం. ఎందుకు పనికిరాని చేతకాని వాడే అహంకారం చూపిస్తాడని కాశీపై స్వప్న అరిచేస్తుంది. నేనెంటో నా విలువేంటో నీకు చూపిస్తానని కాశీ అంటాడు.

అప్పుడే వచ్చిన కావేరి ఇంట్లో గొడవ పడొద్దని ఎన్నిసార్లు చెప్పానని స్వప్నపై సీరియస్ అవుతుంది. ఉంటే కుదురుగా ఉండు లేదంటే నీ మొగుడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపో అని కావేరి అంటుంది. ఇప్పుడే పోతా కానీ ఒక్కదాన్నే అని స్వప్న అంటే, శ్రీధర్ లోపలికి వెళ్లమంటాడు. వెళ్లిన పని ఏమైంది? కాంచనను పిలిచావా? అని కావేరిని శ్రీధర్ అడుగుతాడు. ఆ అవకాశం ఇవ్వలేదని కావేరి అంటుంది.

శౌర్య మాటలతో

అమ్మనాన్నను కలిపే అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలి కదా. మనతో పాటు అమ్మను తీసుకెళ్లాలి. ఇప్పుడే చెప్పాలని దీపతో కార్తీక్ అంటాడు. పొద్దున టిఫిన్ ఏం చేయొద్దు పెద్దమ్మ. శౌర్య స్కూల్ కు వెళ్తుంది. మన నలుగురం నాన్న ఇంటికి వెళ్దాం. అక్కడే టిఫిన్, లంచ్ చేద్దామని అంటాడు కార్తీక్. కానీ కాంచన రావడానికి ఒప్పుకోదు. అప్పుడే వచ్చిన శౌర్య తాత నిన్ను తిట్టకూడదు అంటే నానమ్మను తాత దగ్గరకు పంపించాలి. నాన్న నువ్వు వెంటనే పంపించేయ్ అని అంటుంది.

దీపపై నిందలు

ఎక్కడికే పంపించేది అని కాంచన సీరియస్ అవుతుంది. శౌర్యతో ఆ మాటలు ఎవరో అనిపించారు. ఎవరు అడ్డమైతే వాళ్లే మాట్లాడిస్తారు. ఇవి కావాలని అనిపించిన మాటలు. తల్లి అన్న మాటలే కూతురు అన్నది. నా ఆరోగ్యానికి దీపను తిట్టడానికి కారణం ఏంటీ? శౌర్య నేర్పించిన నాలుగు ముక్కలు చెప్పేసిందని కాంచన అంటుంది. వెంటనే కాంచన కాళ్ల మీద పడ్డ దీప నేనేం తప్పు చేయలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

కార్తీక్ క్షమాపణ

శౌర్య మీ గదిలోనే పడుకుంటుంది. పెద్దవాళ్ల మాటలను వింటుంది. నా భార్య, నా కూతురు అన్న మాటలకు బాధ పడితే నన్ను క్షమించు. అమ్మ రేపు చిన్నమ్మ ఇంటికి మాతో పాటు నువ్వూ రావాలని కార్తీక్ అడుగుతాడు. నేను రాను, మీరు కూడా వెళ్లడం నాకు ఇష్టం లేదని కాంచన చెప్తుంది. అయితే కొడుకు, కోడలిని పంపించడం ఇష్టం లేదని చిన్నత్తకు ఫోన్ చేసి మీరే చెప్పండని అడుగుతుంది దీప.

అంటే నేను చెడ్డదాన్ని అవాలనే కదా. తప్పంతా నాదేనని కాంచన అంటుంది. తప్పంతా నాది. రావడం కుదరదని చిన్నమ్మతో చెప్పాల్సింది. కానీ నా నోట్లో నుంచి రాదు. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటా కదా. నా కోసం ఆ ఇంటికి వస్తావా? అని కార్తీక్ అడిగితే, మీరిద్దరు వెళ్లండని కాంచన లోపలికి వెళ్లిపోతుంది. నేను కూడా రానని దీప అంటే, ప్రెగ్నెంట్ అయింది నేను కాదు నువ్వు అని కార్తీక్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.